Advertisement
Google Ads BL

రామ్ చెక్కేశాడు.. భారమంతా పూరి, ఛార్మీలదే!


ఈ గురువారమే పూరి జగన్నాధ్ - రామ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా మొదలైనప్పుడు.. పెద్దగా అంచనాలు లేవు కానీ.. సినిమా ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగిపోయాయి. రామ్ చాలా రఫ్‌గా కనిపిస్తున్నఇస్మార్ట్ సినిమా మీద మెల్లిగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాతో పూరి జగన్నాధ్‌తో పాటుగా ఛార్మి కూడా గట్టెక్కినట్లే. నిర్మాతలుగా పూరితో పాటుగా ఛార్మి పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడమే కాదు.. టేబుల్ ప్రాఫిట్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడో మొదలయ్యాయి. రామ్ తో పాటుగా హీరోయిన్స్ నభా నటేష్, నిధి అగార్వల్‌లు పలు ఛానల్స్‌కి ఇంటర్వ్యూస్ ఇస్తూ హల్చల్ చేశారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఇస్మార్ట్ సినిమా ప్రమోషన్స్‌ని పక్కనపడేసి రామ్ ఎంచక్కా.. ఫారిన్ చెక్కేసాడు. మరి ఆ ఫారిన్ ట్రిప్ కూడా దాదాపుగా నెలరోజుల పాటు ఉండబోతుంది. అయితే సినిమా రెండు రోజుల ముందు భారీ ప్రమోషన్స్ చెయ్యాల్సిన రామ్ ఇలా ఫారిన్ వెళ్లడంతో ఇప్పుడు ఆ ప్రమోషన్స్ భారాన్ని పూరి, ఛార్మీల మీద పడింది. పూరితో పాటుగా ఛార్మి కూడా ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా శ్రమ పడింది. 

ఛానల్స్ వాళ్ళకి రామ్ ఇంటర్వూస్ ఇచ్చినా వెబ్ మీడియా, ప్రింట్ మీడియాకి ఇంకా ఇంటర్వూస్ ఇవ్వాల్సిన టైమ్‌లో రామ్ లేకపోవడం ఇస్మార్ట్ బృందానికి షాక్. కానీ ఛార్మి, పూరి హీరోయిన్ నభ, నిధి మాత్రం తమవంతుగా సినిమా మీద ఆసక్తి క్రియేట్ చేస్తున్నారు. మరి భారీ ప్రమోషన్స్ లేకపోతే ఇస్మార్ట్ కి కష్టాలు తప్పవు. ఎందుకంటే ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్‌తో పాటుగా దర్శకుడు, నిర్మాతలు కూడా ప్లాప్ బ్యాచ్ కాబట్టి.

Ram in Foreign Tour.. Puri and Charmi in Promotions:

Puri Jagan and Charmi High Range Promotions for Ismart Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs