Advertisement
Google Ads BL

‘జబర్దస్త్‌ షో’ కు పర్మినెంట్ జడ్జ్ కావలెను!!


అవును మీరు వింటున్నది నిజమే. జబర్దస్త్‌కు పర్మినెంట్ జడ్జ్ కోసం సదరు షో యాజమాన్యం సెర్చింగ్‌లో ఉందట. ఇంతకీ షో నుంచి ఎవరు వెళ్లిపోతున్నారబ్బా..? అనేదేగా మీ సందేహం. ఇంకెవరండోయ్.. నగరి ఎమ్మెల్యే కమ్ ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ) చైర్‌పర్సన్ రోజానే. ఇప్పటి వరకూ నగరి ఎమ్మెల్యేగా అటు రాజకీయాలు అప్పడప్పుడు సినిమాలో గ్యాప్‌లో జబర్దస్త్‌లో రోజా జడ్జ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement
CJ Advs

ఇకపై జబర్దస్త్‌కు పర్మినెంట్‌గా గుడ్ బై చెప్పేసి.. నియోజకవర్గ అభివృద్ధి, ఏపీఐఐసీకే సమయం కేటాయించాలని భావిస్తున్నారట. మరీ ముఖ్యంగా పదవి వచ్చిన తర్వాత కచ్చితంగా ఇతరత్రా కార్యక్రమాలన్నీ వదులుకుని దీనికే అంకితమై పనిచేయాలని పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి స్పష్టమైన ఆదేశాలు సైతం వచ్చాయట. దీంతో జబర్దస్‌కు గుడ్ బై చెప్పాలని రోజా ఫైనల్‌గా డిసైడ్ అయ్యారట. రోజా నిర్ణయంతో ఆమె స్థానంలో మీనా లేదా సంఘవిని పర్మినెంట్‌ జడ్జ్‌గా తీసుకోవాలని యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు.. జగన్ కేబినెట్‌లో చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే సామాజికపరంగా రోజాకు మంత్రి పదవి దక్కలేదు. నాటి నుంచి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రోజాకు.. తాజాగా నామినేటెడ్ పదవిని జగన్ కట్టబెట్టారు. మంచి ముహూర్తం చూసుకున్న రోజా జులై 15న ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.

Wanted Permanent Judge For Jabardasth Comedy Show!!:

Wanted Permanent Judge For Jabardasth Comedy Show!!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs