Advertisement
Google Ads BL

‘నాని గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది


నేచురల్‌ స్టార్ ‘నాని’స్ ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ విడుదల 

Advertisement
CJ Advs

నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్ లో  మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న  విభిన్న చిత్రం ‘నాని’స్  ‘గ్యాంగ్ లీడర్’. జూలై 13 న విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకోగా నేడు జూలై 15 న ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.      

బామ్మ.. వరలక్ష్మి.. ప్రియ.. స్వాతి.. చిన్ను..అంటూ అయిదు పాత్రలని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని నాని విడుదల చేశారు. పోస్టర్ లో అయిదుగురు భిన్న వయస్కులైన ఆడవారితో కలిసి బైనాక్యూలర్స్ పట్టుకుని ఉన్న నానితో  ఆకట్టుకునేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ తో ఈ గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లో ఉన్నదెవరో రెవీల్ చేశారు. కథానుగుణంగా ఉన్న ‘నాని’స్ ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలని మరింతగా పెంచింది. ఫస్ట్ సాంగ్ ని జూలై 18 న, టీజర్ ని జూలై 24 న రిలీజ్ చేయనున్నారు. ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ తో డిఫరెంట్ లుక్ లో ఉండే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  రూపొందిన ‘నాని’స్ ‘గ్యాంగ్ లీడర్’ ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 30 న  విడుదల కానుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో  ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్  కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

Nani Gang Leader First Look Released:

Natural Star Nani and Vikram K Kumar combo film Gang Leader First Look Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs