Advertisement
Google Ads BL

ఈ వారం పోటీ ఎవరెవరి మధ్యన అంటే..?


ప్రతి శుక్రవారం టాలీవుడ్ లో సినిమాలకి మధ్య ఎంతో కొంత పోటీ ఉంటుంది. ప్రతివారం రెండు మూడు స్ట్రెయిట్ సినిమాలు కచ్చితంగా రిలీజ్ అవుతాయి. కానీ ఈసారి స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ఒకటే రిలీజ్ అవుతుంది. అది కూడా పూరి - రామ్ ల కాంబినేషన్ లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ గురువారం 18న రానుంది. దీనికి పోటీగా చియాన్ విక్రమ్ నటించిన మిస్టర్ కెకె శుక్రవారం విడుదల కానుంది. అయితే ఈ సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ రెండు ట్రైలర్స్ మాస్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయినట్టు ఉన్నాయి. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. కాకపోతే ఈసినిమాకి ఇటు నెగటివ్ గానూ అటు పాజిటివ్ గానూ మిశ్రమ స్పందన లభించింది. ఏది ఏమైనా మొదటి షోకి అర్ధం అయిపోతుంది. బాగుందని టాక్ వస్తే పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది. లేకపోతే చాలా కష్టం.

Advertisement
CJ Advs

ఇక ఈసినిమాతో పాటు ఒక రోజు గ్యాప్ తో తమిళ డబ్బింగ్ చిత్రం విక్రమ్ మిస్టర్ కెకె వస్తోంది. యాక్షన్ జోనర్‌తో తెరకెక్కిన ఈచిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. హీరోగా విక్రమ్ పూర్తిగా డౌన్ అయిపోయాడు. చాలా బాగుందని టాక్ వస్తే తప్ప ఈసినిమా ఇక్కడ నిలబడే అవకాశంలేదు. మరి ఈసినిమా ఎంతవరకు రామ్ సినిమాకి పోటీ ఇస్తుంది.

ఇక ఈరెండు సినిమాలతో పాటు హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం ది లయన్ కింగ్ వస్తుంది. ఈమూవీ తెలుగు వెర్షన్ కి నాని, అలీ, బ్రహ్మనందం, జగపతిబాబులు వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీనిపై కొంచెం అంచనాలు ఉన్నాయి. కానీ తెలుగు స్ట్రెయిట్ సినిమా ముందు ఇది నిలబడుతుందా? సూపర్ హిట్ అయితే తప్ప. రామ్ ఇస్మార్ట్ శంకర్ కి పర్లేదు అని టాక్ వస్తే చాలు గట్టెక్కెసినట్టే. చూద్దాం ఎవరు సక్సెస్ అవుతారో?

This Week Released Movies List:

Ismart Shankar vs Mister KK vs The Lion King
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs