Advertisement
Google Ads BL

‘సాహో’కి భయపడుతున్నది ‘ఎవరు’?


ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాహో సినిమా మీద ట్రేడ్‌లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 15న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్న సాహో సినిమా అనేక రికార్డులను కొల్లగొట్టడానికి రెడీ అవుతుంది. ప్రభాస్, శ్రద్దా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా టీజర్‌తోనే అంచనాలు మరిన్ని పెరిగిపోయాయి. అయితే ఆగష్టు‌లో విడుదల కాబోతున్న సాహో సినిమాని చూసి ఇపుడు చాలా సినిమాలు భయపడుతున్నాయి. భయపడడం అనే కన్నా సాహోకి ఎదురెళ్ళడం ఎందుకులే అని వెనక్కి తగ్గుతున్నారు. అందులో మొదటగా అడవి శేష్ ‘ఎవరు’ సినిమాని ముందుగా ఆగష్టు‌లో విడుదల చేద్దామనుకున్నారు. కానీ సాహోతో పెట్టుకోవడం కరెక్ట్ కాదని వెనక్కి తగ్గుతున్నారు.

Advertisement
CJ Advs

క్షణం, గూఢచారి సినిమాల్తో హీరోగా ప్రూవ్ చేసుకున్న అడవి శేష్ ఎవరు సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. క్షణం సినిమాలో ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికా నుండి ఇండియాకొచ్చి... పాపని వెతుకుతూ... అదరగొట్టే యాక్షన్‌తో, నటనతో ఆకట్టుకున్న అడవి శేష్.. గూఢచారి సినిమాలో రా ఎజెంట్ గా ఇరగదీసాడు. భారీ ప్రమోషన్స్‌తో గూఢచారి సినిమాని బ్లాక్ బస్టర్ చేసాడు. ఇక ఇప్పుడు కూడా ‘ఎవరు’ సినిమాతో రెజీనాతో కలిసి సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని క్రియేట్ చేసిన అడవి శేష్ తన సినిమాని ఆగష్టు లో విడుదల చేద్దామనుకున్నాడు. 

ఇక మంచి బిజినెస్ జరిగిన ఎవరు సినిమా బయ్యర్లు మాత్రం ఆగస్టు నుండి డేట్ మార్చుకుంటే బెటర్.. సాహో సినిమాతో మనకెందుకు అంటున్నారట. అలాగే ఆగష్టు లో మన్మథుడు 2, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలు కూడా వస్తున్నాయి కాబట్టి.. ఎవరు సినిమాని సెప్టెంబర్ లో విడుదల చెయ్యమని అడగడంతో... ఎవరు నిర్మాతలు కూడా అదే బెటర్ అనుకుంటున్నారట. ఇక సినిమా విడుదలకు టైం దొరికితే... మంచి ప్రమోషన్స్ తో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగేలా చెయ్యొచ్చనే ప్లాన్ లో ‘ఎవరు’ టీం కూడా ఉందట. 

Saaho Fear to tollywood films:

Evaru Movie Postponed with Saaho Fear 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs