Advertisement
Google Ads BL

సమంత ఎక్స్‌పోజ్ చేస్తే చూస్తారు.. నేను చూపిస్తే..!!


‘నేను ఎక్స్‌పోజ్ చేస్తే ఏడుస్తారు.. సమంత చేస్తే చూస్తారు మారండి రా.. రేయ్’ అని అంటోంది టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే శ్రీ శక్తి.. టాలీవుడ్‌లో దాదాపు అందరిపైనా ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయ్. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద హంగామానే చేసిన శ్రీరెడ్డి ఆ తర్వాత చెన్నైకి చెక్కేసింది. అయితే ఈ మధ్య మళ్లీ హైదరాబాద్‌కు వచ్చిన శ్రీ.. మరోసారి వార్తల్లో నిలుస్తోంది.

Advertisement
CJ Advs

ముఖ్యంగా అక్కినేని సమంతను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. ఇప్పటికే ఒకట్రెండు సార్లు ట్వీట్టర్ వేదికగా పాయింటవుట్ చేసి మరీ రచ్చ రచ్చ జేసింది. ‘మా ఆయన్ని మాత్రమే ఓ బేబీ సక్సెస్ మీట్‌కు పిలిచింది కేక్ తినిపించింది.. నన్ను పిలవలేదు నేను హర్ట్ అయ్యా!’ అని  ఫేస్ బుక్‌లో శ్రీ రెడ్డి ఓ పోస్ట్ పెట్టేసింది. అయితే తాజాగా మరోసారి సమంతను టార్గెట్ చేస్తూ ఏకంగా ఎక్స్‌పోజింగ్ గురించి చెప్పుకొచ్చింది.

సమంత ఎక్స్‌పోజింగ్ చేస్తే చూస్తారు కానీ..అదే శ్రీరెడ్డి చేస్తే ఏడుస్తారెందుకు ఇకనైనా మారండి రా రోయ్ అంటూ.. ఆమె సోషల్ మీడియాలో హడావుడి చేసింది. అంతేకాదండోయ్.. ‘మీకు మీ పెళ్లానివి నచ్చవు.. పక్కింటోడి పెళ్లానివి నచ్చుతాయి.. తెలుగు అమ్మాయిలంటే చులకనే మరి ఈ తెలుగు ఇండస్ట్రీకి’ అంటూ శ్రీరెడ్డి ఘాటుగా పోస్ట్ చేసింది. దీంతో శ్రీరెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. ఇందుకు పలువురు నెటిజన్లు, సినీ ప్రియులు స్పందిస్తూ.. ఇలాంటి పోస్ట్‌లతో ఏం సాధిద్దామని అనుకుంటున్నారు మేడం.. మీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో అర్ధమవుతుందా? మీకు నచ్చినట్లు నువ్వు ఉండు.. అది మీ ఇష్టం.. కానీ రోడ్డు మీద పడకు అని సలహాలిస్తున్నారు.

Actress Sree Reddy Targets Tollywood Top Heroine:

Actress Sree Reddy Targets Tollywood Top Heroine
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs