Advertisement
Google Ads BL

తెలుగు బిగ్‌బాస్-3 షో ఆగిపోనుందా..?


తెలుగు బిగ్‌బాస్ షో ఆగిపోనుందా..? వరుస వివాదాలు, ఆరోపణలతో వార్తల్లో నిలిచిన ఈ షోను ఇంతటితో ఆపేయాలని నిర్వాహకులు భావించారా..? ఇప్పటికే పలువురికి ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులను వెనక్కి తీసుకునే పనిలో సదరు టీవీ యాజమాన్యం ఉందా..? అంటే దాదాపు ఇలానే ఫిక్స్ అయిపోయిందని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Advertisement
CJ Advs

తెలుగులో రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో.. ఈ నెల చివర్లో మూడో సీజన్‌ను ప్రారంభించాలని భావించింది. అయితే ఎక్కడలేని ఆరోపణలు, క్యాస్టింగ్ కౌచ్, బూతులు మాట్లాడటం ఇలా కొందరు కంటెస్టెంట్లతో సదరు యాజమాన్యానికి సంబంధించిన కో ఆర్డినేటర్స్ లైంగికంగా వేధించారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయమై హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.

ఈ షోపై ఆది నుంచి అన్నీ ఫిర్యాదులు, ధర్నాలు, ఆందోళనలే ఎక్కువగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే రెండు షోలు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. ఈ సీజన్‌లో వచ్చిన లైంగిక ఆరోపణల విషయమై యూట్యూబ్ స్టార్ శ్వేతారెడ్డి ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకెళ్తారు..? శ్వేతాతో ఈ షో ముగింపు ప్రారంభమైందట..? అయితే పైన చెప్పిన విషయాలపై ప్రస్తుతం పెద్ద ఎత్తున ఫిల్మ్‌నగర్‌లో చర్చ జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో..? లేకుంటే అక్షరాలా అబద్ధమో అనేది తెలియలాంటే ఈ నెల చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.

is it telugu bigg boss stopped these season!:

is it telugu bigg boss stopped these season!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs