Advertisement
Google Ads BL

అల్లు అరవింద్‌కు షాకిచ్చిన రామ్ చరణ్!!


టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నితేష్‌ తివారీ (దంగల్‌ ఫేం), రవి ఉద్యవర్‌ (మామ్‌ ఫేం) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఎవరెవర్ని తీసుకోవాలి..? అని పాత్రదారులను వెతికే పనిలో దర్శకనిర్మాతలు బిజిబిజీగా ఉన్నారు. అయితే రాముడు పాత్రకుగాను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సెట్ అవుతారని అల్లుఅరవింద్ భావించి సంప్రదించారట.

Advertisement
CJ Advs

చెర్రీ నుంచి ఊహించని సమాధానం రావడంతో అల్లు అరవింద్ షాక్ తిన్నారట. ఇందుకు కారణం ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన తెరకెక్కిస్తున్న #RRR చిత్రంలో నటిస్తుండటంతో ‘రామాయణం’లో నటించడానికి వీలుకాదని చెప్పేశారట. దీంతో వాట్ నెక్స్ట్ అని దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డారట.

చిత్ర సహనిర్మాత అల్లు అరవింద్ రామ్‌ చరణ్‌కు స్వయానా మామ అవుతాడన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ #RRR కోసం ‘రామాయణం’ ఆఫర్‌ను వదులుకోవాల్సి వచ్చిందని ఫిల్మ్‌నగర్‌లో పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు.. చెర్రీ మరీ అంత ఈజీగా నో చెప్పాడేంటి..? అంటే మామ కంటే ఎక్కువ నమ్మకం రాజమౌళి మీద ఉన్నట్లేనా..? అని విమర్శకులు చర్చించుకుంటున్నారట. అంతేకాదు.. జక్కన్న చేతిలో పడితే రేంజ్  పెరిగిపోతుందని భావించిన చెర్రీ.. మామయ్యకు నో చెప్పారని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే చెర్రీ కానీ.. అల్లు అరవింద్ కానీ రియాక్ట్ అవ్వాల్సిందే మరి.

Mega Power Star Ram Charan Shocks to Allu Aravind :

Mega Power Star Ram Charan Shocks to Allu Aravind 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs