Advertisement
Google Ads BL

RRR తర్వాత ఎన్టీఆర్ సినిమా ఇదే..!!


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైపోయింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోగా.. ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ వస్తాయా అని అటు రామ్‌ చరణ్ ఫ్యాన్స్.. ఇటు యంగ్‌టైగర్ ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే.. RRR తర్వాత యంగ్ టైగర్ ఏ సినిమాలో నటించబోతున్నారు..? ఆ సినిమా ఎలా ఉండబోతోంది..? అనేదానిపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే అప్పట్లో ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించబోయే చిత్రంలో నటిస్తారని టాక్ నడిచింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే సూపర్ డూపర్ హిట్టవుతుందని అందరూ భావించారు కూడా.

ఈ కాంబోలో రాబోయే సినిమా గురించి.. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ యర్నేని క్లారిటీ ఇచ్చేశారు. ‘కేజీఎఫ్‌’ చిత్రం ఎన్టీఆర్‌కు చాలా బాగా నచ్చిందని.. ఆ దర్శకుడితో సినిమా చేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని యంగ్ టైగర్ తమతో పంచుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇటు ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో.. అటు ప్రశాంత్‌ నీల్‌ ‘కేజీఎఫ్‌ 2’తో బిజీబిజీగా ఉన్నారు. RRR సినిమా అవ్వగానే ఈ సినిమా ప్లాన్ చేయాలని భావిస్తున్నట్లు నవీన్ స్పష్టం చేశారు. అయితే ఈ కాంబోలో వచ్చే సినిమా సెట్స్ దాకా వస్తుందో.. రాదో..? వచ్చినా జనాలను ఏ మేరకు మెప్పిస్తుందో..? కథ ఎలా ఉంటుందో..? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Young Tiger NTR Next Movie Confirmed! :

Young Tiger NTR Next Movie Confirmed! 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs