Advertisement
Google Ads BL

సినిమాలకు గుడ్‌బై చెప్పే ప్రసక్తే లేదు: తెలుగు స్టార్ హీరో


టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘నటనే నా సర్వసం.. నటనే నాకు ప్రాణం... నేనింతే’ అంటూ సెపరేట్‌ రూట్‌లో వెళ్తుంటారు. బాలయ్యకు చెప్పింది చెప్పినట్లుగా నటించడం.. ఒక్క మాటలో చెప్పాలంటే నటించండని అడిగితే జీవించేస్తుంటారు. ఇదీ సినిమాల పరంగా బాలయ్య పరిస్థితి.. ఇంతకు మించి ఏమీ చెప్పలేం. అయితే నటనంటే పడిచచ్చే బాలయ్యను సినిమాలకు దూరం కావాలని.. ఇక పూర్తి స్థాయిలో రాజకీయ రణరంగంలో దూకాల్సిన టైమొచ్చిందని కొందరు పెద్దలు చెప్పారట.

Advertisement
CJ Advs

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో.. కొన్నేళ్లకు గానీ కోలుకోలేని చావుదెబ్బ తిన్న ‘సైకిల్’ (టీడీపీ గుర్తు)కు పంచర్లేసి.. సామాన్లు అన్నీ సిద్ధం చేసి 2024 కల్లా ఫుల్‌ ఫిల్‌గా రెడీ చేయడానికి ఇప్పట్నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో భాగంగా.. మొదట బాలయ్యను సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాలని సూచించారట. అంతేకాదు రాయలసీమ మొత్తానికి బాలయ్యను ఇంచార్జ్‌గా నియమించాలని బాబు భావిస్తున్నారట. టీడీపీ క్యాడర్ సైతం ఇదే కోరుకుంటోందట.

బావ మాటలకు మాత్రం బాలయ్య స్పందిస్తూ... ‘నో నేను సినిమాలకు గుడ్ బై చెప్పడం అంటూ కుదరదు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణిస్తాను. ఇందులో మీకెలాంటి సందేహం అక్కర్లేదు.’ అని చెప్పారట. మొత్తానికి చూస్తే సిల్వర్ స్క్రీన్‌ను వదిలేందుకు తాను సిద్ధంగా లేనని తేల్చిచెప్పేశారన్న మాట. అంటే.. రెండు పడవలపై ప్రయాణానికే బాలయ్య మొగ్గు చూపుతున్నారన్న మాట. సో.. మున్ముంధు పరిస్థితులను బట్టి బాలయ్య బాబు మనసు మార్చుకుని కీలక నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

I Didn’t leave movies said tollywood Star hero:

I Didn’t leave movies said tollywood Star hero
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs