Advertisement
Google Ads BL

అందరూ ‘సినిమా సూపర్‌’ అంటున్నారు: సందీప్


కలెక్షన్లు బావున్నాయని డిస్ట్రిబ్యూటర్లు ఫోనులు చేస్తున్నారు - ‘నిను వీడని నీడను నేనే’ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో సందీప్ కిష‌న్‌ 

Advertisement
CJ Advs

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (జూలై 12న) విడుదలైంది. మార్నింగ్ షో నుండి సినిమాకు హిట్ టాక్ రావడంతో యూనిట్ సంబరాల్లో మునిగింది. టపాసులు కాల్చి సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకున్నారు. 

ఈ సెల‌బ్రేష‌న్స్‌లో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. ‘‘తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్యూ! కంటినిండా నిద్రపోయి సుమారు వారం రోజులైంది. ఎంతో నమ్మి సినిమా తీశాం. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోనని టెన్షన్‌ పడ్డాను. నిన్న మేమంతా తిరుమల కొండపైకి వెళ్లాక, టెన్షన్‌ తట్టుకోలేక ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశా. ఈ రోజు మార్నింగ్‌ షో పడ్డాక ఫోన్‌ ఆన్‌ చేశా. శుక్రవారం ఒంటిగంటకు ఫోన్‌ స్విచ్ఛాన్‌ చేశా. చాలామందికి ఫోనులు చేశా. ప్రతి ఒక్కరు ‘చాలా మంచి సినిమా తీశారు భయ్యా. ఫస్టాఫ్‌ అదిరిపోయింది. లాస్ట్‌లో ఎమోషన్‌ అదిరిపోయింది’ అని చాలా పాజిటివ్‌గా చెబుతున్నారు. వెరీ వెరీ హ్యాపీ. మేం మదర్‌ అండ్‌ ఫాదర్‌ ఎమోషన్‌ను ఇన్నాళ్లు బయటపెట్టలేదు. థియేటర్లలో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌గా ఉండాలనుకున్నాం. ఆ ఎమోషన్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. శనివారం ఎమోషనల్‌ సాంగ్‌ విడుదల చేస్తాం. ఇవాళ ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఫోనులు చేశారు. కలెక్షన్లు బావున్నాయని చెబుతున్నారు. కలెక్షన్లు బావున్నాయంటే అంతమంది థియేటర్లకు వెళుతున్నారు. నాపై, మా సినిమాపై అంత నమ్మకం పెట్టి థియేటర్లకు వెళ్లినందుకు థాంక్యూ. నేను అంత సులభంగా ఏ విషయాన్నీ నమ్మను. ఎక్కువ టెన్షన్‌ తీసుకుంటాను. సపరేట్‌గా నాకు తెలియనివాళ్ల ద్వారా, వాళ్ల వాళ్ల ఫ్యామిలీలకు ఫోన్‌ చేయించి సినిమా ఎలా ఉందో అని ఆరా తీశాను. అందరూ ‘సినిమా సూపర్‌ ఉంది. అదిరిపోయింది. లాస్ట్‌లో ఏడ్చాం’ అంటున్నారు. చాలా చాలా ఎగ్టైటింగ్‌గా, చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఎనర్జీ, ఎగ్జైట్‌మెంట్‌ వచ్చాయి. స్పెషల్‌ థ్యాంక్స్‌ టు తమన్‌. ప్రతి రివ్యూలో ఆర్‌ఆర్‌ ఇరగదీశాడని చెప్పారు. ఈ సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకోవడానికి రెండు రోజుల్లో సక్సెస్‌ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నా. ప్రేక్షకుల దగ్గరకు వెళ్తున్నా. ప్రేక్షకులందరినీ నేరుగా కలవాలని అనుకుంటున్నా. మా దర్శకుడు కార్తీక్‌ రాజు, మా సినిమాటోగ్రాఫర్‌ ప్రమోద్‌ వర్మ, మా నిర్మాతలు దయా పన్నెం, సుప్రియ, వెన్నెల కిశోర్‌, మా ఎడిటర్‌ ప్రసాద్‌ అందరికీ థాంక్యూ. చాలా రోజుల తర్వాత ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతాను’’ అని అన్నారు.

అన్యా సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులకు థాంక్యూ. సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రివ్యూలు చదువుతున్నా. సినిమా బావుందని రాస్తున్నారు. గురువారం తిరుపతి వెళ్లాం. నెర్వస్‌గా ఉండటంతో మేం ఫోనులు స్విచ్ఛాఫ్‌ చేశాం. పాజిటివ్‌ రివ్యూలు చూసి సంతోషించా. నా తొలి తెలుగు సినిమా కాబట్టి హ్యాపీగా ఉన్నారు. సందీప్‌ కిషన్‌ ఈజ్‌ బ్యాక్‌ విత్‌ ఎ బ్యాంగ్‌. మా టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అని అన్నారు.

దయా పన్నెం మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్‌లో ఫస్ట్‌ ప్రొడక్షన్‌లో సక్సెస్‌ఫుల్‌ సినిమా వచ్చింది. నిన్నంతా ఫుల్‌ టెన్షన్‌. మార్నింగ్‌ షో రెస్పాన్స్‌ చూశాక టెన్షన్‌ తీరింది. ఆల్‌ హ్యాపీ! మౌత్‌ టాక్‌ బావుంది. షోలు అన్నీ హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. షోలు పెంచమని అడుగుతున్నారు. సోమవారం సక్సెస్‌ టూర్‌కు వెళతాం’’ అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో నిర్మాత సుప్రియ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ పాల్గొన్నారు.

Ninu Veedani Needanu Nene Success Celebrations Details:

Ninu Veedani Needanu Nene Team Happy with Movie Success
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs