Advertisement
Google Ads BL

‘పండు గాడి ఫోటో..’ టీజర్ సుకుమార్ చేతుల్లో..


ఆలీ హీరోగా పెదరావురు ఫిలిం సిటీ పతాకం సమర్పణలో వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ బ్యానర్ పై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా ‘పండు గాడి ఫోటో స్టూడియో’. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్ర టీజర్‌ను సుకుమార్ ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో ఆలీ, నిర్మాత గుదిబండి వెంకట సాంబి రెడ్డి, దర్శకుడు దిలీప్ రాజా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘నేను ఆలీ గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన చేసే కామెడీని చాలామంది దర్శకులు ఇష్టపడతారు. ఆలీగారు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఒక స్టార్ హీరోలా ఆలీ గారిని దర్శకుడు ఈ చిత్రంలో చూపించారు. రెండు సవంత్సరాలు కథ తయారు చేసుకుని, అనంతరం దర్శకుడు దిలీప్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే నిర్మాత సాంబిరెడ్డి గారికి 22 విద్యాలయాలు ఉన్నాయి. చక్కటి అభిరుచితో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో పాటలు చాలా బాగున్నాయి. జంధ్యాల మార్కు కామెడీతో ఈ సినిమా అందరిని అలరించనుంది." అని అన్నారు.                 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర టీజర్‌ని విడుదల చేసిన సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు జంధ్యాలగారి ఫోటోకి నమస్కరించి ఈ సినిమా ప్రారంభించాం. ఈ చిత్రంలో మా హీరో ఆలీ ఎవరికి ఫోటో తీస్తే వారికి పెళ్లి అయిపోతుంది. ఈ చిత్రంలో పాత్రలు విలక్షణంగాను, నటీనటుల పేర్లు వైవిధ్యంగాను ఉంటాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అలాగే నూతన నటుడు సందీప్ రాజా, టీనా చౌదరి ఈ చిత్రంలో విలక్షణ పాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు యాజమాన్య సారథ్యంలో శ్రేయగోషల్, మనీషా చక్కని పాటలు పాడారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్ర ఫ్రీ రిలీజ్ వేడుకను తెనాలిలో ఈనెల 21న నిర్వహించనున్నాం’’ అని అన్నారు.                               

ఆలీ, రిషిత వినోదకుమార్, బాబుమోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మీ రాంజగన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ రాము తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాత: గుదిబండి వెంకట సాంబిరెడ్డి, సహ నిర్మాతలు: ప్రదీప్ దోనెపూడి, మన్నె శివకుమారి, సంగీతం: యాజమాన్య, ఎడిటర్: నందమూరి హరి, కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఫైట్స్: షా వాలిన్, మల్లేష్, డాన్స్: రఘు మాస్టర్, అజయ్ శివశంకర్, అమ్మ సుధీర్; కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దిలీప్ రాజా

Pandugadi Photo Studio Teaser Released:

Sukumar Launches Pandugadi Photo Studio Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs