Advertisement
Google Ads BL

‘నిను వీడ‌ని నీడ‌ను..’ ఇదేదో ఆ సినిమాలా ఉందే!


తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చిన ‘ఆదిత్య 369’ లాంటి సినిమా రాలేదు. ఇది అప్పటిలో ఓ వినూత్న ప్ర‌యోగం. భూత‌, భ‌విష్య‌త్‌, వ‌ర్త‌మానాల్ని సింగీతం చూపించిన విధానం అబ్బుర ప‌రిచింది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈసినిమాను మరోసారి తీయాలని అనుకున్నాడు దర్శకుడు సింగీతం శ్రీనివాస్. టైటిల్ కూడా ‘ఆదిత్య 999’ అనుకున్నారు కానీ అది వర్కవుట్ కాలేదు. ఫ్యూచర్ లో మనుషులు ఎలా మారిపోతారు, ఏమి చేస్తారు అనేది ఈ సీక్వెల్‌ కాన్సెప్ట్.

Advertisement
CJ Advs

అయితే వీరు ఎలాగో ఈసినిమాను తీయడంలేదని ఓ యంగ్ హీరో అదే ఫార్ములాతో మన ముందుకు వస్తున్నాడు. ఆ హీరోనే సందీప్ కిషన్. త‌న కొత్త సినిమా ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’లో సేమ్ ఈ కాన్సెప్ట్ వాడాడు. ఇది కూడా భూత – భ‌విష్య‌త్ – వ‌ర్త‌మానాల కాన్సెప్ట్ ప్ర‌కార‌మే సాగ‌బోతోంది. అయితే ఫ్యూచర్ లో 20 ఏళ్ల‌లో ఎలాంటి సాంకేతిక మార్పులొస్తాయి? స‌మాజం, మ‌నుషులు ఎలా మారిపోతారు అనే విష‌యాన్ని ఇందులో చూపిస్తున్నారు. 

సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాల్లోనే ఫ్యూచర్ లోకి తీసుకుని వెళ్ళిపోతారట. విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన ఈ సీన్స్ బాగా వచ్చాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. 20 ఏళ్ల ముందుకే కాదు, 20 ఏళ్ల వెన‌క్కి కూడా తీసుకెళ్ల‌బోతోంది చిత్ర‌బృందం. ఇది హారర్, ఫాంట‌సీ అంశాలతో వస్తున్న సినిమా. ఈ సినిమా హిట్ అవ్వడం సందీప్ కిషన్ కి చాలా అవసరం.

NVNN Inspires from Balakrishna Old Movie:

Ninu Veedani Needanu Nene Movie Inspires from Aditya 369
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs