దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ హైలెట్ గా నిలుస్తాయి. సినిమా ఎలా ఉన్నా వీటితో లాగించేస్తాడు రాజమౌళి. ప్రొడ్యూసర్స్ తో మాగ్జిమం ఖర్చు వీటిపై పెట్టిస్తాడు. అది చిన్న సినిమా అయినా కానీ. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోస్ ని పెట్టి మల్టీస్టార్రర్ తీస్తున్నాడు అంటే ఇంక ఏ రేంజ్ లో ఖర్చు పెడతాడో ఆలోచించవచ్చు. ప్రస్తుతం రాజమౌళి తీసే RRR లో హీరోస్ పరిచయ సన్నివేశాలకే నలభై కోట్లు కేటాయించేసాడు.
ఇద్దరి హీరోస్ ని అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పరిచయ సన్నివేశాలూ అదిరిపోయేలా వుంటాయట. ఫ్యాన్స్ కి ఈ సీన్స్ పూనకాలే అంట. ఇంట్రడక్షన్ సీన్ కోసం రాజమౌళి చాలానే కష్టపడుతున్నాడు. రాజమౌళి మీద పూర్తి నమ్మకంతో ప్రొడ్యూసర్స్ కూడా ఏమి అనలేని పరిస్థితి. ఇంట్రడక్షన్ సీన్లకే ఒక మీడియం రేంజ్ హీరో సినిమా బడ్జెట్ పెట్టిస్తున్నాడంటే ఆ సీన్లు ఏ రేంజ్‌లో వుంటాయో ఊహించుకోవడం కూడా కష్టమే.
ఈలెక్కన ఇద్దరిని కలిపే ఇంటర్వెల్ సీన్ కోసం ఎంత ఖర్చు పెట్టారో? ఇక ఈమూవీకి మూడొందల కోట్లు అవుతుందని ముందే ప్రకటించారు. కానీ ఇప్పుడు అది 400 కోట్లు అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. వచ్చే ఏడాది 2020 లో ఈసినిమా రిలీజ్ కానుంది.