బిగ్‌బాస్ సీజన్-03 త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హోస్ట్, ఎప్పట్నుంచి ప్రసారం అనే విషయాలపై క్లారిటీ వచ్చేసింది. ఇక మిగిలిందల్లా కంటెస్టెంట్లు ఎవరనేది మాత్రమే. నెట్టింట్లో పలువురు పేర్లు హల్ చల్ చేస్తున్నప్పటికీ ఇంత వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఈ షో పై జనాలకు మరింత ఆసక్తి పెరిగింది. అయితే తాజాగా ఈ బిగ్‌బాస్ షో 1,2, హోస్ట్‌లతో పాటు.. 3 హోస్ట్ అక్కినేని నాగార్జున గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పదిస్తూ తన అభిప్రాయాన్ని యూట్యూబ్ చానెల్ వేదికగా పంచుకున్నారు.
"14 మంది వ్యక్తిత్వాలను బయట కూర్చొన్న వ్యక్తి విశ్లేషించడం సాధారణ విషయం కాదు. కానీ చిన్న రామయ్య(జూనియర్ ఎన్టీఆర్) దాన్ని అవలీలగా చేసేశాడు. అయితే నాని హోస్టింగ్‌లో చిన్న రామయ్యలో ఉన్న చెణుకులు, పంచ్‌లు లేవు. చాలా క్లాసీగా, అద్భుతంగా నడిపాడు" అని గోపాల కృష్ణ చెప్పుకొచ్చారు.
ఇక నాగార్జున గురించి మాట్లాడిన ఆయన.. ‘మన్మథుడు’లా చేశారని ప్రోమోని బట్టి అర్థమవుతోంది. ఈ కార్యక్రమం చూసే మహిళా ప్రేక్షకులు, బిగ్ బాస్ ఇంట్లో ఉండే కంటెస్టెంట్లను చూడాలా? లేదంటే నాగ్‌ని చూడాలో అర్థం కాక తికమక పడతారు. నాగ్‌తో పాటు కంటెస్టంట్లందరికీ శుభాకాంక్షలు" అని పరుచూరి బ్రదర్స్ తన యూ ట్యూబ్ చానెల్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ‘మా’ యాజమాన్యం, మన్మథుడు ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.