Advertisement
Google Ads BL

‘దొరసాని’ అంద‌రికీ న‌చ్చుతుంది: ఆనంద్ దేవ‌ర‌కొండ‌


 క‌థ‌లోని నిజాయితీ అంద‌రికీ న‌చ్చుతుంది...ఆనంద్ దేవ‌ర‌కొండ‌

Advertisement
CJ Advs

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మ‌ధురా ఎంట‌ర్ టైన్మెంట్, బిగ్ బెన్ సిన‌మాలు సంయుక్తంగా నిర్మించిన సినిమా  దొర‌సాని. ఈమూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకొని యు/ఎ స‌ర్టిఫికేట్ ని పొందింది. కె.వి.ఆర్ మ‌హేంద్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న దొర‌సాని చిత్రం  ఈ నెల 12న రిలీజ్ కి సిద్ద‌మ‌వుతున్న‌ సంద‌ర్భంగా హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ మీడియాతో ముచ్చ‌టించారు.

దొర‌సాని గురించి: ఇది ఒక పిరియాడిక్ ల‌వ్ స్టోరీ, రాజు, దొర‌సాని మ‌ధ్య జ‌రిగిన ప్రేమ‌క‌థ‌. నిజ‌జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే ప్రేమ‌క‌థ‌.  క‌థ‌లోని స్వ‌చ్ఛ‌త‌, నిజాయితీ ఈ ప్రేమ‌క‌థ‌ను ముందుకు న‌డిపిస్తాయి. అన్నీ రియ‌ల్ లోకేష‌న్స్  లో షూటింగ్ చేసాము. ఆ క‌థ‌లోని ఆత్మ‌ను తెర‌మీద‌కు తెచ్చే ప్ర‌య‌త్నం చేసాం. ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర ఎక్క‌డా ఫేక్ ఎమోష‌న్స్ ని రానీయ‌లేదు. క‌థ‌ను ద‌ర్శ‌కుడు ట్రీట్ చేసిన విధానం చాలా రియ‌లిస్టిక్ గా ఉంటుంది.

ఆ ఆఫ‌ర్స్ ని సీరియ‌స్ గా తీసుకోలేదు: అన్న‌య్య (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) అర్జున్ రెడ్డి త‌ర్వాత కొన్ని ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. కానీ అప్పుడు సీరియ‌స్ గా తీసుకోలేదు. ఇండియాకి అన్న‌య్య బిజినెస్ ని స‌పోర్ట్ చేద్దామ‌ని వ‌చ్చాను. యుస్ కి వెళ్ళ‌కు ముందు థియేట‌ర్స్ చేసాను. యాక్టింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఉందికానీ సినిమా ఎక్స్ పీరియ‌న్స్ లేదు.  ఆ టైంలో ద‌ర్శ‌కుడు మ‌హేంద్రను క‌లిశాక సినిమా మీద ఉన్న భ‌యాలు పోయాయి. ఆయ‌న 5 గంట‌లు క‌థ చెప్పాడు. ఆ క‌థ‌ను చెప్పిన తీరులోనే నాకు అర్దం అయ్యింది. ప్ర‌తి పాత్ర రియ‌ల్ గా ఉంటుంది. క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, సిద్ధిపేటలో రియ‌ల్, కోదాడ ద‌గ్గ‌ర‌లోని గ‌డిలో ఎక్కువ రోజులు షూట్ చేసాము.

అన్న (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) టెన్ష‌న్ ప‌డ్డాడు: సినిమా చూసే ముందు అన్న టెన్ష‌న్ ప‌డ్డాడు. కానీ సినిమా చూసిన త‌ర్వాత చాలా ఆనంద ప‌డ్డాడు. సినిమా చూసిన త‌ర్వాత నాకు అన్న ఇచ్చిన ఎన‌ర్జీ కాన్ఫిడెన్స్ ని పెంచింది. 

ఆడిష‌న్స్ ద్వారా సెలెక్ట్ అయ్యాము: విజ‌య్ దేవ‌రకొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌రకొండ ఒక‌డు ఉన్నాడు అని సినిమా స‌ర్కిల్ లో తెలుసు. ఈక‌థ కోసం ఆర్టిస్ట్ ల‌ను వెతుకుతున్న‌ప్పుడు న‌న్ను ట్రై చేద్దాం అనుకున్నారు. నేను, శివాత్మిక ఆడిష‌న్స్ చేసాము. ఆ క్యారెక్ట‌ర్స్ కి ఫిట్ అవుతాము అనే న‌మ్మ‌కం ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు వ‌చ్చాకే మేము ప్రాజెక్ట్ లోకి వ‌చ్చాము.

శివాత్మికను అందుకే క‌ల‌వ‌లేదు: ఈ కథ‌లో రాజు, దేవ‌కి పాత్ర‌ల మ‌ధ్య ఎక్క‌వ చ‌నువు ఉండ‌దు. అందుకే మాకు వ‌ర్క్ షాప్ లు విడివిడిగా నిర్వ‌హించారు.  షూటింగ్ లొకేష‌న్ లో కూడా పాత్ర‌ల మ‌ధ్య గ్యాప్ ను మెయిన్ టైన్ చేసాము. మేము ప్రెండ్స్ అయితే ఆ ఫీల్ స్క్రీన్ మీద‌కు వ‌స్తుంద‌ని ఆ జాగ్ర‌ర్త తీసుకున్నాము. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యాము.

అన్న నాకు ధైర్యం వ‌చ్చాడు: అన్న చాలా స్ట‌గుల్స్ చూసాడు. కానీ అన్న‌కు వ‌చ్చిన స‌క్సెస్ నాకు ధైర్యాన్నిచ్చింది.  టాలెంట్ ఉంటే స‌క్సెస్ అవ్వొచ్చు అనే న‌మ్మ‌కం క‌లిగింది. కానీ నా ప్ర‌తిభే న‌న్ను నిల‌బెడుతుంద‌ని నాకు తెలుసు. ఒక బ్ర‌ద‌ర్ స‌పోర్ట్ నాకు ఎప్పుడూ త‌న  ద‌గ్గ‌ర ఉంటుంది, కానీ స్టార్ గా కాదు. అన్నతో పోలిక‌ల‌న్నీ సినిమా త‌ర్వాత పోతాయి అని న‌మ్ముతున్నాను.

నా పాత్ర హీరోలాగా ఉండ‌దు: ఇందులో నాపాత్ర చాలా రియ‌లిస్టిక్ గా ఉంటుంది. రాజు చాలా స‌హాజంగా అనిపిస్తాడు. దొర‌సానిని ప్రేమించిన రాజు లాగా క‌న‌ప‌డ‌తాను. చేసిన పాత్ర‌లు  రియ‌ల్ లైఫ్ పాత్ర‌ల‌ను ప్ర‌తిబింబిస్తే చాలు ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతార‌ని న‌మ్ముతార‌ని న‌మ్ముతాము.

అన్న మాట్లాడుతుంటే క‌న్నీళ్ళు వ‌చ్చాయి: ఇంట్లో అంద‌రం ప్రాక్టిక‌ల్ గా ఉంటాము. ఎమోష‌న‌ల్ టాక్స్ త‌క్కువ‌. కానీ అన్న నా గురించి మాట్లాడుతుంటే ఎమోష‌న‌ల్ అయ్యాను. ఎందుకంటే త‌మ్ముడ్ని చూసుకోవాల‌ని అన్న‌కు ఉంటుంది. కానీ నా క‌ష్టం నేను ప‌డాలి, నా క‌థ నేను వెతుక్కొవాలి అని అన్న అనుకున్నాడు. స్టేజ్ మీద అలా మాట్లాడుతుంటే నేను అన్న‌లాగే ఫీల్ అయ్యాను. అన్న‌ది ప‌దేళ్ళ ప్ర‌యాణం. అందులో చాలా చూసాడు. అన్న‌తో పాటు ఒకసారి ఆడిష‌న్స్ కి వెళ్ళాను. సెలెక్ట్ అవ‌లేదు ఆ రోజు అన్న ఎంత బాధ ప‌డ్డాడో నేను ద‌గ్గ‌ర‌ నుండి చూసాను. నాన్న సీరియ‌ల్స్ డైరెక్ట్ చేసేవారు, ఇంట్లో రోజూ సినిమా గురించి డిస్క‌ష‌న్స్ ఉండేవి.

సినిమా ముందు వ‌చ్చే కామెంట్స్ ని ప‌ట్టించుకోను: సోష‌ల్ మీడియాలో వ‌చ్చే కామెంట్స్ ని సీరియ‌స్ గా తీసుకోను. సినిమా రిలీజ్ అయ్యాక నా న‌ట‌న మీద వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను తీసుకుంటాను. సినిమాపై పూర్తి న‌మ్మ‌కం ఉంది.

ఇది స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థ: ఇందులో మా ప్రేమ‌క‌థ స్వ‌చ్చంగా ఉంటుంది. యాక్ష‌న్, యాంగ‌ర్ అలాంటివి ఏమీ ఉండ‌వు.  లిప్ లాక్ లు అంత ఇపార్టెంట్ కావు. మా ప్రేమ‌క‌థ‌లో చాలా ట‌ర్న్స్ ఉంటాయి. మాప్రేమ‌ను మీరు ఫీల్ అవుతారు. ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర గ్రేట్ స్టోరీ టెల్ల‌ర్. మా క‌థ‌లోని అన్ని క్యారెక్ట‌ర్ మీద అత‌నికి పూర్తి క్లారిటీ ఉంది. అత‌ను మంచి ద‌ర్శ‌కుడిగా నిల‌బ‌డ‌తాడు.

ఆనంద్ దేవరకొండ,  శివాత్మిక  హీరోహీరోయిన్లుగా  పరిచయం అవుతోన్న ఈ చిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సురేష్ బాబు సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి

సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి

ఎడిటర్: నవీన్ నూలి

సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి

ఆర్ట్ డైరెక్టర్: జెకె మూర్తి

పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా

కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని

నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని

రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర

Anand Deverakonda Dorasani Movie Interview:

Anand Deverakonda Talks about Dorasani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs