నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్ ‘మన్మథుడు 2’ షూటింగ్ పూర్తి.. ఆగస్ట్ 9న గ్రాండ్ రిలీజ్
కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్(జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుదలను త్వరలోనే నిర్వహించడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం ఈ సినిమాలో అవంతిక పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ క్యారెక్టర్‌ను ప్రోమో రూపంలో రిలీజ్ చేశారు.
నటీనటులు:
కింగ్ నాగార్జున
రకుల్ ప్రీత్ సింగ్
లక్ష్మి
వెన్నెలకిషోర్
రావు రమేష్
ఝాన్సీ
దేవదర్శిని తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి.కిరణ్
నిర్మాణ సంస్థలు: మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్
మ్యూజిక్: చైతన్య భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
ప్రొడక్షన్ డిజైనర్స్: ఎస్.రామకృష్ణ, మౌనిక
స్క్రీన్‌ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్
ఎడిటర్స్: ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి
డైలాగ్స్: కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్
కాస్ట్యూమ్స్: అనిరుధ్ సింగ్, దీపికా లల్వాని.
పోస్ట్ ప్రొడక్షన్: సి.వి.రావ్
పి.ఆర్.ఒ: వంశీ-శేఖర్, బి.ఎ.రాజు