Advertisement
Google Ads BL

‘చార్మీ’ డిస్కౌంట్ ఆఫర్.. మగవారికి మాత్రమే!


డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మి ఎంత సన్నిహితంగా ఉంటారో కొత్తగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే ‘పూరి క‌నెక్ట్స్’ పేరుతో ఓ సంస్థను స్థాపించి.. కొత్త హీరో హీరోయిన్స్‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఆన్‌లైన్ వేదికగా బట్టలు అమ్మే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ విషయమై చార్మి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టం చేసింది.

Advertisement
CJ Advs

ఈ ఆన్‌లైన్ ‌సేల్‌‌కు గాను ‘బి ఇస్మార్ట్’ అనే బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారం చేయబోతున్నట్లుగా చార్మి అధికారికంగా తన ట్విట్ట్టర్ వేదికగా స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇప్పుడిప్పుడే వ్యాపారం మొదలుపెట్టబోతోంది గనుక ప్రతి కస్టమర్ మొదటి కొనుగోలుపై 30 పర్సంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వబోతున్నట్టు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. అయితే ఇది మగవారికి మాత్రమేనండోయ్. ఎందుకంటే ఇందులో కేవలం మగవారికి సంబంధించిన దుస్తులు మాత్రమే ఉంటాయ్ కాబట్టి.

హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన చార్మి.. నిర్మాణరంగంలోకి దూకారు.. అక్కడ కూడా పెద్దగా రాణించలేకపోయింది. అయితే ఇవన్నీ వద్దనుకున్న చార్మీ ఏకంగా బిజినెస్ విమెన్‌గా ఓ ఊపు ఊపాలనుకుంటోంది. ఈ సరికొత్త ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Charmi gives Offer: Only for Gents:

Charmi and Puri starts New Business 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs