Advertisement
Google Ads BL

‘అయోగ్య’ తెలుగు రిలీజ్ ఎప్పుడంటే..?


విశాల్‌ హీరోగా  తమిళంలో రూపొందిన చిత్రం ‘అయోగ్య’. తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది. ఏ.ఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌ మోహన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశాల్‌ సరసన రాశీఖన్నా కథానాయికగా నటించింది. ‘ఠాగూర్‌’ మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని  సార్థక్‌ మూవీస్‌ అధినేత ప్రశాంత్‌ గౌడ్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 27న సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రేజీగా రిలీజ్‌ చేయనున్నారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత ప్రశాంత్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘అయోగ్య’ తమిళంలో ఘనవిజయం సాధించింది. అక్కడా బాక్సాఫీస్‌ వద్ద చక్కని వసూళ్లను రాబట్టింది. తమిళ క్రిటిక్స్‌ సైతం ఈ చిత్రానికి 3.5 రేటింగులు ఇచ్చి ప్రశంసలు కురిపించారు. విశాల్‌ ఎనర్జీ లెవల్‌ని పదింతలు చూపించిన సినిమా ఇది. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్‌ సినిమాకే హైలెట్. తమిళనాడులో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా పతాక సన్నివేశాల్ని దర్శకుడు తీర్చిదిద్దారు. తమిళంలో హిట్టయిన ఈ చిత్రాన్ని తెలుగులో  మా సార్థక్‌ మూవీస్‌ ద్వారా రిలీజ్‌ చేస్తుండడం ఆనందాన్నిస్తోంది. తెలుగులో విశాల్‌ నటించిన సినిమాలన్నీ వరుసగా విజయాలు అందుకుంటున్నాయి. ఆ కోవలోనే ‘అయోగ్య’ ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఈనెల 27న ఏపీ, నైజాంలో రిలీజ్‌ చేస్తున్నామని తెలిపారు.

Ayogya Movie Release Date Fixed:

Ayogya Movie Release on july 27th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs