గత మూడు రోజులుగా టాలీవుడ్ ప్రముఖులే కాదు... సాధారణ ప్రేక్షకుడు కూడా సమంత హీరోయిన్ గా నటించిన ఓ బేబీ ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు. ఓ బేబీ లో సమంత నటనకు 100 కి 100 మార్కులు పడుతున్నాయి. అందుకే ఓ బేబీ కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఫ్యామిలీస్ మాత్రమే కాదు.. చిన్న పెద్ద అంతా ఓ బేబీ మ్యానియాలోనే ఉన్నారు. సమంత క్రేజ్ తో మంచి ఓపెనింగ్స్ సంపాదించిన ఓ బేబీ... ఫస్ట్ వీకెండ్ లోనే సినిమా కొచ్చిన హిట్ టాక్ తో మంచి.. కాదు కాదు.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఓ బేబీ కి పెట్టింది కేవలం 13 కోట్ల బడ్జెట్ మాత్రమే. అయితే అందులో థియేటర్స్ రైట్స్ కే 10 కోట్లకు పైగానే వచ్చేసాయి. ఇంకా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కి అదనంగా వచ్చాయి.
ఇక ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే... ఎప్పుడూ స్టార్స్ సినిమాలనే కాదు.. చిన్న సినిమాలను కూడా డిజిటల్ ప్రపంచంలో నెంబర్ వన్ గా ఎదిగిన అమెజాన్ ప్రైమ్ వారే ఎగరేసుకుపోతుంటే.. ఈసారి ‘ఓ బేబీ’ ని మాత్రం అమెజాన్ కి పోటీగా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్కడ పోటీ వాతావరణం ఓ బేబీ కి కలిసొచ్చింది. ఇక 13 కోట్ల పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు ఓ బేబీ ఫస్ట్ వీకెండ్ లోనే 17 కోట్ల (గ్రాస్) కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందించింది. సమంత క్రేజ్.. సినిమా కొచ్చిన పాజిటివ్ టాక్, అలాగే క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ అన్ని ఓ బేబీ ని కేవలం మూడు రోజులకే 17 కోట్లను కొల్లగొట్టే దిశగా నడిపించాయి. వరల్డ్ వైడ్ గా ఈ రేంజ్ కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ కొల్లగొట్టడం సామాన్యమైన విషయం కాదు. మరి ఫస్ట్ వీకండ్ లో దడదడ లాడించిన ఓ బేబీ మొదటి వారం ముగిసేసరికి నిర్మాతలకు ఏ రేంజ్ లాభాలు తెస్తుందో చూడాలి.