నయనతార కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్ రేంజ్ లో దూసుకుపోతుంది. పెళ్లి అనే పదాన్ని దగ్గరకి రాకుండా... ప్రియుడు విగ్నేష్ శివన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ భామ అటు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తోనూ, ఇటు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గాను, మరోపక్క కోలీవుడ్ కుర్ర హీరోలకు నయన్ బెస్ట్ ఆప్షన్ గా ఉంది. ఆ రేంజ్ లో సినిమాలు చేస్తున్న నయనతారని స్టార్ హీరోలతో పోలుస్తూ లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేసారు. అటు గ్లామర్ గాను, ఇటు నటన పరంగాను నయనతారే నెంబర్ వన్ అన్న రేంజ్ లో ఉంది ఆమె చేసే సినిమాలు చూస్తుంటే. నయనతారలా ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా లేడీ ఒరియంటెడ్ మూవీస్‌తో దూసుకుపోతుంది.
నయనతార గతంలో తమిళంలో ఆరమ్ అనే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో నటించింది. ఆ సినిమాలో కలెక్టర్ పాత్రలో నయనతార నటన సింప్లి సూపర్బ్. దర్శకుడు గోపి నైనార్ తెరకెక్కించిన ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అదే చిత్రం తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదలై హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయాలనుకుంటున్నాడు గోపి నైనార్. అయితే ఈ సినిమాలో నయన్ నటించే ఛాన్స్ లేదట.
ఎందుకంటే నయనతార ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలతోనూ, అలాగే యంగ్ హీరోల సినిమాలు రెండు.. చేస్తూ బిజీగా ఉండడంతో.. నయన్ ప్లేస్ లోకి ప్రస్తుతం టాప్ క్రేజ్ ఉన్న సమంతని తీసుకుందామనే ఆలోచనలో గోపి నైనార్ ఉన్నట్లుగా సమాచారం. ఎలాగూ సమంతకి కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉండడంతో... ఆరమ్ సీక్వెల్ కి సమంతానే ఫైనల్ చేసే యోచనలో దర్శకుడు ఉన్నట్లుగా తెలుస్తుంది.