Advertisement
Google Ads BL

నానితో మాత్రమే సినిమా తీస్తానంటున్న డైరెక్టర్!


నేచురల్ స్టార్ నానితో మాత్రమే సినిమా తీస్తాను.. ఆయన తప్ప మరెవ్వరితో చేయను.. నా రెండో సినిమా నానితో చేయాలంతే అని ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ స్వరూప్ ఫిక్సయిపోయారట. నానితో సినిమా చేయడానికి గాను ఓ ప్రముఖ రచయితేనని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది.

Advertisement
CJ Advs

నవీన్ పొలిశెట్టి-శ్రుతి శర్మ-సుహాస్-సందీప్ నటీనటులుగా తెరెక్కించిన చిత్రం ‘ఏజెంట్ ఆత్రేయా’ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ సినిమా. డిటెక్టివ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు సహా ఓవర్సీస్ ఆడియన్స్‌ను బాగా మెప్పించింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు రిలీజైనప్పటికి జనాలంతా ‘ఆత్రేయ’కే జై కొట్టేశారు.

మొదటి సినిమాతో సూపర్ అనిపించుకున్న స్వరూప్ తన రెండో సినిమా నాని- కోన కాంబినేషన్‌లోనే ఉంటుందని సమాచారం. అయితే ఈ విషయంపై స్వరూప్ మాత్రం నానితో సినిమా చేస్తున్నట్లుగానీ.. నానిని సంప్రదించినట్లుగానీ ప్రకటించలేదు. నాని - కోన అనుబంధంతో ఈ సినిమా స్వరూప్‌కు వర్కవుట్ అయినట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురి కాంబినేషన్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది..? ఇవన్నీ సినిమా సెట్స్ దాకా వెళ్తాయా..? లేకుంటే ఫిల్మ్ నగర్‌లోనే పుకార్లుగా మిగిలిపోతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

i will do movie with natural star nani said telugu director:

i will do movie with natural star nani said telugu director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs