Advertisement
Google Ads BL

అనంత్ శ్రీరామ్ చేతుల మీదుగా నీ జతగా సాంగ్ విడుదల


నీ జతగా చిత్రంలోని ఇదే ఇదే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసిన ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్.

Advertisement
CJ Advs

ఆదిత్య మ్యూజిక్ ఇదే ఇదే సాంగ్ ను రేడియో సిటీ 91.1 ఎఫ్.ఎం ద్వారా శ్రోతలకు వినిపించింది. ఈ సందర్బంగా ఇదే ఇదే సాంగ్ ను రచించిన అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడుతూ... మనిషి జీవితంలో చిన్న ప్రయాణాలు అక్కడ జరిగే సంఘటనలు మనిషి జీవితాన్నే మార్చేస్తాయి. ప్రస్తుత జీవన గమనంలో మనిషి ప్రకృతికి చాలా దూరమైపోతున్నాడు. దాని వల్ల అనేక నష్టాలు తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 

ఈ మధ్య ట్రిక్కింగ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ట్రిక్కింగ్ కారణంగా మనిషి ప్రకృతికి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా కొందరు యువతి యువకులు ట్రిక్కింగ్ వెళ్ళినప్పుడు వారి మధ్య జరిగే కొన్ని సంఘటనలు, ప్రకృతికి వీరికి మధ్య జరిగిన విషయాలు, ప్రకృతి నుండి జీవితానికి అవసరమైన విషయాలు తెలుసుకోవడం ఇలా సాగిపోయే కథనం.

ఈ కథనం పతాక స్థాయికి చేరుకొనే సందర్భంలో ఆ భావాన్ని స్పష్టంగా వ్యక్తపరిచే విధంగా ఇదే ఇదే సాంగ్ రాయడం జరిగింది. ఈ సాంగ్ కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందని ఆశిస్తున్నా అన్నారు.

సుభద్ర క్రియేషన్స్ ద్వారా నీ జతగా మూవీని నిర్మించిన రామ్. బి గారు మాట్లాడుతూ...

ఈ మూవీ ట్రిక్కింగ్ బేస్డ్ లవ్ స్టోరీ. 60 ఏళ్ల జీవితాన్ని మూడు రోజుల ప్రయాణంలో మనిషి చూసినప్పుడు, మనిషి అనుభూతులు, ఆ అనుభూతుల తాలూకు అంశాలు ఎంత మధురంగాను, ఎంత క్లిష్టంగాను ఉంటాయో అనే అంశాలు చాలా గొప్పగా చూపించామని, సహజంగా మాటల్లో చెప్పలేని అంశాలను భావాలను పాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేసాము. పాటలన్ని ప్రజాధారణ పొందుతాయని  తెలిపారు.

నీ జతగా మూవీ డైరెక్టర్ బి.వీర మాట్లాడుతూ... నా సొంత అనుభవంలోని యదార్థ సంఘటనల ఆధారంగా కథ రాసుకోవడం తద్వారా కథనాన్ని రూపొందించుకొని నేను ట్రిక్కింగ్ వెళ్లిన ప్లేస్ లోనే షూట్ చేసాను. ఇది నాకు మర్చిపోలేని అనుభూతి. 

ఈ కథ కొత్తవారితో చేస్తే బాగుంటుందని వారికి నటనతో మెలకువలు నేర్పించడం జరిగింది. అలాగే 10 మంది కొత్త టెక్నీషియన్స్ కు అవకాశాలు ఇచ్చాము. అడిగిన వెంటనే పాట రాసి ఇచ్చిన అనంత్ శ్రీరామ్ గారికి థాంక్స్. మమ్మలి సపోర్ట్ చేస్తున్న ఆదిత్య మ్యూజిక్ వారికి, నన్ను నమ్మి సినిమాను నిర్మించిన నిర్మాతకు ధన్యవాదాలు తెలిపారు.

సినిమా: నీ జతగా

డైరెక్టర్: బి.వీర 

ప్రొడ్యూసర్: రామ్. బి

పాట పేరు: ఇదే ఇదే

గేయ రచయిత: అనంత్ శ్రీరామ్

మ్యూజిక్: పవన్

బ్యానర్: శ్రీ సుభద్ర క్రియేషన్స్

మ్యూజిక్ కంపెనీ: ఆదిత్య మ్యూజిక్

పాట పాడినవారు: హరిని

Ananta Sriram Launched Nee Jataga Song:

Nee Jataga Song Launch At Radio City  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs