Advertisement
Google Ads BL

ఈ శుక్రవారం విన్నర్ ఎవరో..?


టాలీవుడ్‌లో ప్రతి శుక్రవారం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం ఆనవాయితీ అయిపోయింది. రాబోయే శుక్రవారం కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంటే జూలై 12న చాలానే సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే ఇందులో ఎన్ని విడుదల అవుతాయి అనేది పక్కన పెడితే ప్రధానమైన పోటీ మాత్రం మూడింటి మధ్య ఉండబోతోంది. 

Advertisement
CJ Advs

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మికలను పరిచయం చేస్తూ రూపొందిన ‘దొరసాని’ ఈ రేసులో ప్రధాన చిత్రంగా నిలబడనుంది. ఇది కులాంతరాల మధ్య బ్యాక్ డ్రాప్‌తో, తెలంగాణ స్లాంగ్‌లో సాగే సినిమా. ఇద్దరికీ తొలి సినిమా అయినా బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

ఇక హీరో సందీప్ కిషన్‌కు హిట్ వచ్చి చాల ఏళ్ళు అయిపోతుంది. ఎన్నో ఇబ్బందులు పడుతూ తనే స్వయంగా నిర్మాతగా మారి ఆయనే హీరోగా రూపొందిన హారర్ మూవీ ‘నిను వీడని నీడను నేనే’’. ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యాక హైప్ బాగా పెరిగింది. ఈసినిమా హిట్ అవ్వడం సందీప్‌కు చాలా అంటే చాలా అవసరం.

ఇక శ్రీహరి వారసుడు మేఘాంష్ హీరోగా రూపొందిన రాజ్ దూత్ కూడా అదే తేదీకి క్లాష్ అవుతోంది. ఇది బైక్ గురించి కథ. ఇలా ఒకదానికి మరొకటి ఈ మూడు ఏ మాత్రం సంబంధం లేని జోనర్లు కావడం విశేషం. ఇక వీటితో పాటు హృతిక్ రోషన్ సూపర్ 30 కూడా అదే రోజు వస్తోంది. దీనిపై అంచనాలు బాగా ఉన్నాయి. చూద్దాం ఈ సినిమాలలో ఏ సినిమా సక్సెస్ అవుతుందో అనేది. 

Next Friday Release Movies List:

Dorasani vs Ninu Veedani Needanu Nene vs Rajdhoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs