మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ బేబీ ఎంత పెద్ద హిట్టో ప్రేక్షకులే చెప్పేసారు. అయితే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని హీరోయిన్ సమంత ఎంతో గట్టిగా నమ్మింది. కనుకనే ఆ సినిమా మీద భారీగా ప్రమోషన్స్ నిర్వహించింది. అయితే ఓ కొరియన్ మూవీని రీమేక్ చెయ్యడం... ఆ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకం మాత్రం సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుకు ఏ కోశానా లేదట. మరి ఓ బేబీ రీమేక్ చేయడానికి సమంత... నందిని రెడ్డిని ఒప్పించడమే కాదు.. నిర్మాతగా వరసకు పెదనాన్న అయిన సురేష్ బాబుని ఒప్పించింది.
కానీ సురేష్ బాబుకి మాత్రం ఓ బేబీ హిట్ అవుతుందనే నమ్మకం లేదట. అలాంటి జోనర్లు తెలుగులో ఆడవని సమంతకి ఎంత చెప్పినా వినలేదట. మిస్ గ్రానీ లోని ఫీల్‌ని తెలుగులో తీసుకురాలేమని సురేష్ బాబు ఎప్పటికప్పుడు సమంతకి చెబుతూనే ఉన్నాడట. అసలు మొదట్లోనే అంటే.. స్క్రిప్టు పూర్తయి, రెండు రోజుల్లో సెట్స్‌పైకి వెళ్తుందనగా.. ఈ సినిమాని ఆపేయాలని కూడా సమంతకి సురేష్‌బాబు చెప్పినట్లుగా ఫిలింనగర్ టాక్.
అయినా సమంత పట్టుదలతో ఆ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్ళడం.. ఆ తర్వాత ప్రమోషన్స్ విషయంలోనూ సురేష్ బాబు లైట్ తీసుకోవడంతో.. సమంత మాత్రం ఇది తన సొంత సినిమానే అన్నట్టుగా భారీగా ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యింది. అంతే కాదు.. సమంత చేసిన హంగామాతో టాలీవుడ్ మొత్తం ఓ బేబీ గురించే మాట్లాడుకున్నారు అంటే.... ఆ సినిమా మీద సమంత అందరిలో ఎంత ఇంట్రెస్ట్ కలిగించిందో అర్ధమవుతుంది.
మరి సినిమా విడుదలైన మొదటి షోకే హిట్ టాక్ పడడమే కాదు... ఓ బేబీ సినిమాకి క్రిటిక్స్ సైతం సూపర్ హిట్ రివ్యూస్ ఇవ్వడంతో... ఈ వీకెండ్ లో సమంత చేతికందినంత దున్నేయ్యడం ఖాయంగా కనబడుతుంది. ఈ వారం మొత్తంలో ఓ బేబీ కలెక్షన్స్ అదిరిపోవడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.