Advertisement
Google Ads BL

ఆ నిర్మాతలకు ఏదో ఒక్కటి చెప్పేయచ్చుగా పవన్!?


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా సినిమాలు చేస్తారని అప్పట్లో టాక్ నడిచిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. హారిక హాసిని, మైత్రీతో పాటు మరొక సంస్థ నుంచి పవన్ అడ్వాన్స్‌లు కూడా తీసుకున్నారట. కాగా.. వీరిలో మైత్రీది మాత్రం కాస్త పెద్ద మొత్తమే అని తెలుస్తోంది. అటు పవన్‌కు రాజకీయాలకు పెద్దగా కలిసిరాకపోవడం.. ఇటు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలా వద్దా అనేది దిక్కుతోచట్లేదు.

Advertisement
CJ Advs

మరోవైపు.. తన దగ్గర ఉన్న నిర్మాతల అడ్వాన్స్‌లు వెనక్కు ఎందుకు ఇవ్వడం లేదో? సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉందా..? లేదా..? అనేది ఎవ్వరికీ సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయిందట. పైగా.. అడ్వాన్స్‌లు అంటే ఐదు పది రూపాయిలు కాదు కదా.. కోట్లలో ఉంటుంది.. ఆ కోట్లకు నిర్మాతలు నెలనెలా గట్టిగానే వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇలా గత కొన్ని నెలలుగా పవన్ సినిమా చేస్తాను..? లేకుంటే లేదు అనేది క్లారిటీగా చెప్పకపోవడంతో నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారట.

పవన్ ఆ మధ్య.. లుక్ మార్చడంతో హమ్మయ్యా.. ఇక మన సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనని భావించారట. అయితే ఆ తర్వాత ఒకట్రెండు నెలలు గడిచినప్పటికీ పవన్ మాత్రం నోరు మెదపలేదట. మరోవైపు తాను ఇక రాజకీయాలకే పరిమితం అవుతానని పవన్ పలు మార్లు క్లారిటీ చెప్పేశారు. దీంతో పవన్‌ను గట్టిగా అడగలేక.. ఇటు వడ్డీలు కట్టుకోలేక నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారట. ఆ నిర్మాతలకు సినిమా చేయనని చెప్పి అడ్వాన్స్‌లు వెనక్కి ఇచ్చేయడమా.. లేకుంటే సినిమా చేస్తాను కాస్త టైమ్ ఇస్తేనని ఏదో ఒక్కటి చెప్పేయచ్చుగా సార్..!

Producers Waiting for Pawan Kalyan Decision:

Producers suffers with Power Star Statements
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs