Advertisement
Google Ads BL

ఈ ఏడాది సెకండ్ హాఫ్ మొదటి హిట్ ఇదే!


ఈ ఏడాది మొదట్లో ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ ప్రేక్షకులను మైమరపించింది. పెద్ద పెద్ద సినిమాలైన కథానాయకుడు, వినయ విధేయరామలను తట్టుకుని చిన్న సినిమాగా తెరకెక్కిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అయ్యి ఈ ఏడాది మొదటి హిట్ ని నమోదు చేసింది. తరవాత ఫిబ్రవరిలో యాత్ర లాంటి మూవీ వచ్చినా ప్రేక్షకులకు నచ్ఛలేదు. ఇక మార్చిలో కళ్యాణ్ రామ్ 118 తో ఓ మాదిరి కొట్టాడు. ఇక ఏప్రిల్ లో సమంత - నాగ చైతన్యల మజిలీ సూపర్ హిట్ అయ్యింది. తర్వాత వచ్చిన చిత్రలహరి సో సో గా ఆడింది. ఇక అదే ఏప్రిల్ లో నాని జెర్సీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.  ఆ నెల చివరిలో హాలీవుడ్ మూవీ ఎండ్ గేమ్ ప్రభంజనం సృష్టించింది. తరవాత మేలో మహేష్ మహర్షి బిగ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా... ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని... బడ్జెట్ కి సరిపోయే కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. ఆ నెలలో తర్వాత వచ్చిన సీత, ఎన్జీకే లాంటి సినిమాలు కొట్టుకుపోయాయి. ఇక ఈ ఏడాది అర్ధభాగం పూర్తయ్యే నెల జూన్ లో ప్రేక్షకులు కాస్త గాలి పీల్చుకున్నారు. జూన్ లో వచ్చిన గేమ్ ఓవర్, మల్లేశం, ఏజెంట్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని... మొదటి అర్ధ భాగాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాయి.

Advertisement
CJ Advs

ఇక ఈ ఏడాది సెకండ్ హాఫ్ మొదలవడమే సమంత ఓ బేబీతో హిట్ నమోదు చేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిన ఓ బేబీ విడుదల తర్వాత కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓ బేబీ ఫస్ట్ హాఫ్ కామెడీగా ఎంటర్టైన్ చెయ్యగా.. సెకండ్ హాఫ్ లో సాగదీత సన్నివేశాలతో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీల్ అయినా.. ఓవరాల్ గా ఓ బేబీ సూపర్ హిట్ అయ్యింది. ఇక సమంత మ్యానియా, ఆమె క్రేజ్ అన్ని ఓ బేబీకి అదనపు హంగులు కావడం కూడా ఆ సినిమాకి కలిసొచ్చాయి. ఇక సమంత మాత్రం ఈ ఏడాది సెకండ్ హాఫ్ ని గ్రాండ్ గా ఓ బేబీ హిట్ తో ఓపెనింగ్ చేసేసింది.

Samantha gets First Hit in 2019 Second Half:

Oh Baby is the 2019 Second Half first hit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs