Advertisement
Google Ads BL

దొరసాని కోసం వెయిటింగ్: శివాత్మిక


దొరసాని కోసం ఎదురుచూసాను... శివాత్మిక రాజశేఖర్

Advertisement
CJ Advs

ఆనంద్ దేవరకొండ, శివాత్మకలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’ జూలై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈమూవీ ట్రైలర్, పాటలతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన ముద్రను వేసింది. కె.వి.ఆర్. దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగనుంది. దొరసాని ప్రమోషన్స్ లో బాగంగా ఈ రోజు మీడియాతో ముచ్చటించారు హీరోయిన్ శివాత్మిక. 

సినిమా తోనే పెరిగాను : షూటింగ్స్ అనేవి నా ఊహా తెలిసినప్పటి నుండి నా జీవితంలో భాగం అయ్యాయి. స్కూల్ కన్నా ఎక్కువగా షూటింగ్ లోనే టైం స్పెండ్ చేసేదానిని. నేను హీరోయిన్ అవుతానంటే అందుకేనేమో ఇంట్లో ఎవరూ పెద్దగా సర్ ప్రైజ్ అవలేదు. కానీ దొరసాని రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పుడు మాత్రం ఇంట్లో సందడి ఎక్కువవుతుంది.

నేనూ దొరసాని కోసం ఎదురుచూసాను: ఈ కథ వింటున్నప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. దర్శకుడు మహేంద్ర ఆ క్యారెక్టర్ ని వివరించిన విధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. మొత్తం నాలుగు గంటల సేపు కథ చెప్పారు. ఆ తర్వాత ఆడిషన్స్ నన్ను ఆనంద్ ని కలిపే చేసారు. ఆడిషన్స్ కూడా అయ్యాక రెండు నెలలు  నాకు ఎలాంటి కబురు అందలేదు. ఆ టైంలో ఆ పాత్ర  కోసం నేను ఎదురుచూసాను. నేనే అని తెలిసాక  చాలా ఎగ్జైట్ అయ్యాను.

పాత కొత్త ఫీల్ ప్రేమ కథలకు ఉండదు: పాత, కొత్త అలాంటి తేడాలు ప్రేమకథలకు ఉండవు అని నేను నమ్ముతాను. మోడ్రన్ గాళ్ గా కనిపించాలని అనుకోలేదు. పిరియాడిక్ మూవీస్ అంటే బాగా ఇష్టపడతాను. ఈ ప్రేమకథలో కనిపించే స్వచ్ఛత నన్ను బాగా ఆకర్షించింది. అందుకే నేను చాలా ఇష్టపడి చేసాను. నేను సంజయ్ లీలా బన్సాలి  సినిమాలకు పెద్ద ఫ్యాన్. అలాంటి కథతోనే ఇంట్రడ్యూస్ అవడం చాలా ఆనందంగా ఉంది.

దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర చాలా ఖచ్చితంగా ఉంటారు: పాత్రలకోసం రాసుకున్న సన్నివేశాలు ఏమీ లేవు. ఆయన కథతోనే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళారు. నేను ఒక డైలాగ్ చెప్పకుండానే నన్ను సెలెక్ట్ చేసానని షూటింగ్ అయ్యాక చెప్పారు. ఆయన సన్నివేశాలను బాగా ఎక్స్ ప్లెయిన్ చేస్తారు. ఆయన చెప్పిన దాన్ని చేసుకొని చేసుకుంటూ వెళితే చాలు. మొదటి సన్నివేశానికి చాలా టెన్షన్ పడ్డాను, కానీ దర్శకుడు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నన్ను నడిపించింది.

అమ్మ సినిమాలే నాకు రిఫరెన్స్: ఈ కథ 80 దశకాల్లో జరిగే కథ అప్పటి కట్టు బొట్టు గురించి నాకు పెద్దగా తెలియదు. తలంబ్రాలు టైంలో అమ్మ అలంకరణ, స్టైల్ ని రిఫరెన్స్ లా తీసుకున్నాను. అచ్చం అమ్మలాగే ఉన్నావని షూటింగ్ లోకేషన్స్ లో అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ నాకు ఒకటే చెప్పేవారు ఏ క్యారెక్టర్ చేస్తున్నా ఇన్వాల్వ్ అయి చేయమని చెప్పేవారు. అమ్మ నాకు ఎప్పుడూ ఒక  ఎనర్జీ సోర్స్ లాగా ఉంటుంది.

మా ప్రేమ కళ్ళలోనే కనపడుతుంది : చాలా ప్రేమకథలలో కనిపించే స్వేచ్ఛ ఈ ప్రేమ కథలో ఉండదు. మా ప్రేమ కళ్ళలోనే తెలుస్తుంది. అదే ఈ కథను కొత్తగా ప్రజెంట్ చేస్తుంది. నా క్యారెక్ట్ కి పెద్దగా డైలాగ్ లుండవు. నా పాత్రలోని ఎమోషన్స్ అన్నీ కళ్ళలోనే పలుకుతాయి. అదే ఛాలెంజ్ గా అనిపించింది.  దొరసానిగా కెమెరా ముందు నిలబడే కాన్ఫిడెన్స్ డైరెక్టర్ మహేంద్ర నుండే వచ్చింది. కోదాడ దగ్గర ఒక గడీలో 25 డేస్ షూట్ చేసాము. అది నాకు మంచి ఎక్స్ పీరియన్స్ గా మిగిలిపోతుంది.   నేను చేస్తానో లేదో అనే సందేహాలు ఎప్పుడూ లేవు. నేను చెస్తాను అని బలంగా నమ్మేవారు. ఆ నమ్మకమే నన్ను నడిపించింది.

రాజశేఖర్ కూతురిగా ఆనందమే ఎక్కువ: నాన్న కుండే ఇమేజ్ ని చిన్నతనం నుండి చూస్తూ పెరిగాను. ఈ మధ్యనే కల్కి రిలీజ్ అయి ఆ సినిమా తెచ్చిన సందడి ఇంట్లో తగ్గకముందే నా సినిమా రిలీజ్ కి వచ్చేసింది. నాన్న నా సినిమా గురించి అందరికీ గొప్పగా చెబుతుంటే చాలా ఆనందంగా ఒక పక్క టెన్షన్ గా కూడా ఉంది. నాన్న ఇమేజ్ తెచ్చే ఒత్తిడి కంటే ఆనందమే ఎక్కువ. నాన్న డైరెక్టర్స్ హీరో గానే ఉన్నారు, నేను అదే ఫాలో అవుతున్నాను.

గడీల కథలు తెలుసుకున్నాను.: దొరసాని పాత్ర అంగీకరించాక, గడీల గురించి కొంచెం చదువుకున్నాను. దొరల గురించి, దొరసానిల గురించి తెలుసుకున్నాను. 150 యేళ్ళ నుండి ఉన్న గడిలో షూటింగ్ చేసాము. షూటింగ్ జరుగుతున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ గడీల గురించి చెప్పేవి విని చాలా ఆశ్చర్యపోయాను. దొరసాని అనే అమ్మాయికి బయట ప్రపంచం తెలియకుండా పెరుగుతుంది. ఆ గడీనే ప్రపంచంగా పెరుగుతుంది. రాజు దొరసాని జీవితంలోకి వచ్చాక ఏం జరిగింది అనేదే కథ..? కానీ రాజు దొరసానిని చేరుకోవడానికి ఏం చేస్తాడు అనేది  ఒక రియలిస్టిక్ గా చూపించాడు దర్శకుడు.

ఆనంద్ దేవరకొండ బెస్ట్ : ఆనంద్ తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంది. చాలా తక్కువ మాట్లాడతాడు. కానీ షూటింగ్ లో నెమ్మదిగా ఫ్రెండ్స్ అయ్యాము. నా కంటే ముందే ఆనంద్ సెలెక్ట్ అయ్యాడు. సెట్ కి వెళ్ళాక రాజు క్యారెక్టర్ ఆనంద్ కంటే బెటర్ గా ఎవరూ చేయరేమో అనిపించింది. చాలా బాగా హార్డ్ వర్క్ చేసాడు. తెలంగాణ స్లాంగ్ కోసం చాలా బాగా ప్రాక్టీస్ చేసాడు. అతని నటన గురించి రిలీజ్ అయ్యాక మాట్లాడుకుంటారు. ప్రేక్షకులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా కథలు ఎమీ ఒప్పుకోలేదు. నా ఏజ్ కి తగ్గ కథలు చేద్దామనుకుంటున్నాను. దొరసానిగా నా నటనకు ప్రేక్షకులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను. అమ్మా, నాన్నలు ఈసినిమాపై, నా నటనపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంట్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకునే టాపిక్ దొరసాని గురించే. అందుకే దొరసాని తర్వాత మిగిలిన కథల గురించి ఆలోచిస్తాను. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక  హీరోహీరోయిన్లుగా  పరిచయం అవుతోన్న ఈ చిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సురేష్ బాబు సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి

సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి

ఎడిటర్   : నవీన్ నూలి

సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి.

ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి

పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా

కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని

నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని

రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర

Shivatmika Rajasekhar Dorasani Interview:

Shivatmika Rajasekhar About Dorasani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs