Advertisement
Google Ads BL

సమంత ముందు నిలబడలేక పోయడుగా!


నిన్న శుక్రవారం ప్రధానంగా రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సమంత - నందిని రెడ్డి కాంబోలో కొరియన్ లో హిట్ అయిన మిస్ గ్రానీ మూవీ తెలుగులో ఓ బేబీగా రీమేక్ అయ్యింది. ఆ సినిమాలో బేబీగా సీనియర్ నటి లక్ష్మి నటిస్తే.. 25 ఏళ్ళ పడుచు బేబీగా సమంత నటించింది. ఇక మరొక సినిమా ఆది సాయి కుమార్ - డైమండ్ ర‌త్న‌బాబు కాంబోలో రెండు బుర్రల కథ అనే కొత్త కాన్సెప్ట్ తో బుర్రకథ అనే సినిమా కూడా నిన్ననే విడుదలైంది. అయితే చాలారోజులుగా ప్లాప్స్ లో ఉన్న ఆది సాయి కుమార్ బుర్రకథ చిత్రం, సమంత ఓ బేబీ ముందు నిలబడగలదా అంటూ సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వినబడ్డాయి. కానీ బుర్రకథ సినిమా ట్రైలర్ చూసాక సినిమాలో దమ్ముందని.. మిగతా ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది.

Advertisement
CJ Advs

అయితే సమంత హీరోయిన్ గా కీలకపాత్రలో నటించిన ఓ బేబీ సినిమా హిట్ టాక్ తెచ్చుకోగా... ఆది బుర్రకథ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఓ బేబీలో కథ, కామెడీ, సమంత నటన, లక్ష్మి - రాజేంద్ర ప్రసాద్ నటన, సినిమాటోగ్రఫీకి ప్రేక్షకులు నుండి క్లాప్స్ పడుతుంటే.. బుర్రకథ సినిమాకి ఒకే సినిమాలో ఇటు క్లాస్, అటు మాస్ గా అభిరాం పాత్రలో ఆది సాయి కుమార్ తేలిపోయాడు. ఇక దర్శకుడు హీరోయిన్స్‌ని ఎందుకు తీసుకున్నాడో తెలియదు. కాస్త మిస్తీ అందంగా కనబడినా.. నటనకు స్కోప్ లేని పాత్ర దక్కడంతో ఆమె దమ్మీగా మిగిలింది. కామెడీ కాస్త ఓకే అయినా... సినిమాటోగ్రఫీ అక్కడక్కడా మెప్పించి... మ్యూజిక్ కానీ, నేపధ్య సంగీతం కానీ మెప్పించలేకపోయాయి. మ్యూజిక్ డైరక్టర్ సాయికార్తీక్ ఆకట్టుకోలేకపోయాడు. 

ఇక మిస్ గ్రానీకి మ్యూజిక్ సో సో గా ఉన్నప్పటికీ... హిట్ టాక్ అండ్ రివ్యూ రైటర్స్ కూడా 3 రేటింగ్స్‌తో హిట్ చేసేస్తే... బుర్రకథకు పూర్ రేటింగ్స్ ఇవ్వడమే కాదు.... ప్రేక్షకులు కూడా థియేటర్స్ నుండి బయటికి వచ్చేటప్పుడు నీరసంగా వస్తున్నారంటేనే బుర్రకథ ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

Oh Baby Beats Burrakatha :

Samantha Oh Baby Gets Hit Talk at Boxoffice
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs