Advertisement
Google Ads BL

‘సవారి’ టీజర్ కొత్తగా ఉంది: తరుణ్ భాస్కర్


‘బంధం రేగడ్’ అనే ఇండిపెండెంట్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోత్‌కూరి సవారి చిత్రంతో దర్శకుడిగా మారారు. నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా, టి.ఎన్.ఆర్ పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా హీరో నందు మాట్లాడుతూ.. ‘‘ఇదివరకు నేను చాలా సినిమాల్లో నటించాను. సవారి చిత్రం నా కెరీర్ లో బెస్ట్ అని భావిస్తున్నా. ఈ చిత్రం మిమ్మల్ని ఆకర్షిస్తుందని నమ్ముతున్నాను. డైరెక్టర్ సాహిత్ కొత్త కథను మీముందుకు తీసుకొని వస్తున్నారు. నిర్మాతలు సంతోష్ మోత్కురి, నిశాంక్ రెడ్డి కుడితి ఈ సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. నా బాడీ ల్యాంగేజ్, క్యారెక్టర్ ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అయ్యాయి. త్వరలో ట్రైలర్ విడుదల చేసి విడుదల తేదీని ప్రకటిస్తాము’’ అన్నారు.

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాల్లో కొత్త కథలు వస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు సాహిత్ ఎంచుకున్న కథ డిఫరెంట్‌గా ఉంది. దాన్ని తెరమీద బాగా చూపిస్తాడన్న నమ్మకం ఉంది. నందుకు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని నమ్ముతున్నా. ఈ చిత్రానికి పనిచేసిన అందరూ టెక్నీషియన్స్‌కు నిర్మాతలకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను..’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ కథ విన్నప్పుడే బాగా నచ్చింది. డైరెక్టర్ సాహిత్ గుడ్ టాలెంటెడ్, నిర్మాతలు బాగా తీశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నందుకు ఈ సినిమా బ్రేక్ ఇస్తుంది. అన్ని పాటలు బాగా వచ్చాయి. త్వరలో సాంగ్స్ విడుదల చేస్తాము. సవారి సినిమా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు.

ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘‘కొత్త చిత్రాలను యూత్ ఎప్పుడూ ఆదరిస్తున్నారు. సవారీ సినిమా టీజర్ కొత్తగా ఉంది. ఈ మూవీ ప్రేక్షకాదరణ పొందుతుందని నమ్ముతున్నాను. నందుకు, డైరెక్టర్ సాహిత్‌కు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకంటున్నాను..’’ అన్నారు.

టి.ఎన్.ఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ స్లాంగ్‌లో వస్తోన్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్ర దర్శకుడు సాహిత్ వర్క్‌కు నేను అభిమానిని. అతని ఇండిపెండెంట్ మూవీ చూసాను. అద్భుతంగా తీశాడు. సవారి అంతకుమించి ఉంటుందని భావిస్తున్నా, నందుకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు.

డైరెక్టర్ సాహిత్ మాట్లాడుతూ...మీడియా వారికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు వర్క్ చేసిన అందరూ టెక్నీషియన్స్ కు ధన్యవాదాలు. నందు ఈ పాత్రకు బాగా సెట్ అయ్యాడు. సినిమా విడుదల తరువాత మళ్ళీ మాట్లాడుతాను.. అన్నారు.

హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ.. నందు మంచి నటుడు, ఈ చిత్ర షూటింగ్ సమయంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో నేను ఛాలెంజింగ్ రోల్ చేసాను. నా మీద నమ్మకంతో నాకు ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ సాహిత్ కు థ్యాంక్స్. టీజర్ బాగుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. సినిమా కూడా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను.. అన్నారు.

 

సాంకేతిక వర్గం:

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సాహిత్ మోత్‌కూరి

నిర్మాతలు: సంతోష్ మోత్కురి, నిశాంక్ రెడ్డి కుడితి

బ్యానర్: కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషా ఫిలింస్

సంగీతం: శేఖర్ చంద్ర

ఎడిటర్: సంతోష్ మీనం

సినిమాటోగ్రఫీ: మోనిశ్ భూపతిరాజు

ఆర్ట్: అర్జున్ సూరిశెట్టి

డిఐ: విష్ణు వర్ధన్

ఆడియోగ్రఫీ: రాధాకృష్ణ

ప్రొడక్షన్ డిజైన్: అభిజిత్ గుముడవెల్లి

పబ్లిసిటీ డిజైన్: అనిల్ భాను

పీఆర్‌ఓ: వంశీశేఖర్

Savaari Teaser Released:

Savaari Teaser Release Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs