రీల్ లైఫ్‌లో లవ్.. రియల్ లైఫ్‌లో పెళ్లి.. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయ్. సినీ ఇండస్ట్రీలో చాలావరకు ప్రేమ పెళ్లిళ్లు అయినప్పటికీ అదే వ్యక్తి స్క్రీన్ షేర్ చేసుకుని.. లైఫ్ లాంగ్ అడుగులేసిన వారిలో ఎక్కువగా వినపడేది అక్కినేని నాగ చైతన్య, సమంతల పేర్లే. వీరిద్దరు పెళ్లి చేసుకుని హాయిగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చైతూకు ఇచ్చిన కట్నం గురించి ఈ టాప్ హీరోయిన్ చెప్పుకొచ్చింది.
ఇంటర్వ్యూలో.. నాగచైతన్యకు మీరు ఎంత కట్నమిచ్చి పెళ్లి చేసుకున్నారు..!? అనే ప్రశ్న ఎదురవ్వగా.. చైతూను పెళ్లి చేసుకోడానికి భారీగానే కట్నం ఇచ్చుకున్నానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అయితే ఎంత సమర్పించుకున్నారు..? ఎన్నికోట్లు కట్నంగా ఇచ్చారు..? ఎన్ని ఫ్లాట్స్, బంగారం..? ఇచ్చిపుచ్చుకున్నారన్న విషయం మాత్రం క్లారిటీ చెప్పడానికి ఆమె కాసింత ఇబ్బంది పడ్డది.
ఎంతైనా పెద్దింటి.. పేరుగాంచిన ఫ్యామిలీ కుర్రాడు కదా..? ఎంత స్టార్ హీరోయిన్ అప్పటికీ గట్టిగానే ఇచ్చుకోక తప్పదుగా..? అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా మరికొందరు మాత్రం ఎంతిస్తే ఏముందులే ఇచ్చుకున్నారు.. లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారు అదే చాల్లే అని అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. అయితే ఈ కట్నకానుకల వ్యవహారంపై చైతూ.. అక్కినేని నాగ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.