Advertisement
Google Ads BL

విలన్‌గా మారుతున్న రఘుకుంచె


యాంకర్ గా, సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రఘు కుంచె తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు.. ఫస్ట్ లుక్ తోనే క్యూరీయాసిటీ క్రియేట్ చేసిన ‘‘పలాస 1978’’ మూవీలో రఘు కుంచె విలన్ గా కనిపించబోతున్నారు. అది కూడా సాదా సీదా విలన్ పాత్ర కాదు. నాలుగు డిఫరెంట్ షేడ్స్ లో పర్ఫార్మెన్స్ కు బాగా స్కోప్ ఉన్న చాలెంజింగ్ పాత్ర చేయబోతున్నారు.. ‘‘పలాస 1978’’ కు రఘు కుంచె మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుండటం మరో విశేషం. ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్ కు, రఘు విలన్ పాత్రకు సూటవుతారని ఫిక్స్ చేశారు.. ఈ క్యారెక్టర్ లో నాలుగు డిఫరెంట్ ఏజ్ లు చూపించే పాత్రను రఘు చేస్తున్నారు. ఈ సినిమాలో 30-40-50-70 ఏజ్ లలో అతను కనపించబోతున్నారు.

Advertisement
CJ Advs

రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘‘పలాస 1978’’ చిత్రం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘‘పలాస 1978’’ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటున్నారు దర్శక నిర్మాతలు.

రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి

మాటలు : లక్ష్మీ భూపాల

పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్

సంగీతం : రఘు కుంచె

పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా

నిర్మాత : ధ్యాన్ అట్లూరి

రచన, దర్శకత్వం : కరుణ కుమార్.

Raghu Kunche Turns Villain:

Raghu Kunche villain in Palasa 1978
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs