యాంకర్ కం డైరెక్టర్ ఓంకార్ రాజు గారి గది 1 తీసి సూపర్ సక్సెస్ కొట్టిన సంగతి తెలిసిందే. దాని తరువాత సమంత, నాగార్జున ప్రధాన పాత్రల్లో రాజు గారి గది 2 తీసాడు. ఇది కూడా సక్సెస్ అయింది. కొంచం గ్యాప్ తీసుకుని ఇప్పుడు రాజు గారి గది 3 తీయాలని డిసైడ్ అయ్యాడు ఓంకార్. ఆల్రెడీ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. హీరోయిన్‌గా మిల్క్ బ్యూటీ తమన్నా ఫైనల్ అయిపోయింది. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.
హీరోయిన్ గా ఫైనల్ అయినా తమన్నా రీసెంట్ గా క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆమె తప్పుకోవడంతో ఆమె ప్లేస్‌లో తాప్సీ వచ్చి చేరిందనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం ఎవరిని తీసుకుందాం అని ఆలోచిస్తున్న టీమ్‌లో చాలా మంది కాజల్ పేరు సజెస్ట్ చేశారట. ఆమెతో ఆల్రెడీ డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేశారట మేకర్స్.
ఒకవేళ ఆమె ఓకే అంటే మాత్రం త్వరలోనే దీన్ని అధికారంగా ప్రకటించే అవకాశముంది. ఇక ఇందులో లీడ్ పాత్రలో ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు నటించనున్నాడు.