మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమాగా చారిత్రాత్మక చిత్రం సై రా నరసింహ రెడ్డి చేస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని సై రా నసింహరెడ్డిగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే కంప్లీట్ చేసుకుంది. సై రా నరసింహ రెడ్డి గెటప్ లో చిరంజీవి అదుర్స్ అన్న రేంజ్ లో ఉన్నాడనే విషయం చిత్ర ఫస్ట్ లూక్లోనే చూసేసాం. చిరు కున్న ఫ్యాన్ ఇమేజ్ కి సై రా లాంటి చారిత్రాత్మక చిత్రం చెయ్యడం మాములు విషయం కాదు. మరి ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలు చేసేటప్పుడు... హీరోల్లో మాస్ ఇమేజ్ కానీ, అలాగే ఆ హీరోలనుండి మాస్ స్టెప్స్ కానీ ఆశించడం కరెక్ట్ కాదు. అందులోను చిరంజీవి చేసింది ఒక స్వాతంత్య్ర సమరయోధుడు కేరెక్టర్.
అయితే సైరా సినిమాలో ఒక జానపద గీతానికి చిరు మాస్ స్టెప్స్ వెయ్యాల్సి వచ్చిందట. అయితే ఆ పాట రషెస్ చూసిన తర్వాత చిరు కి ఓ డౌట్ వచ్చిందట. ఒక స్వాతంత్య్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ ఇలాంటి మాస్ స్టెప్స్ వేస్తే బావుండదని అనిపించిన వెంటనే ఆ మాస్ స్టెప్స్ ని తీసేశారట. మరి మాస్ స్టెప్స్ లేకపోతే చిరు అభిమానులు ఎలా తట్టుకున్టారో.... అంతేకాదు క్లైమాక్స్ విషయంలోనూ చిరు, సురేందర్‌రెడ్డి బాగా ఆలోచించారట.
ఎందుకంటే స్వతహాగా ఒరిజినల్ ఉయ్యాలవాడ కథలో నరసింహారెడ్డి తలను బ్రిటీష్‌వారు నరికి, కోట గుమ్మానికి వేలాడదీస్తారు. మరి అదే క్లైమాక్స్‌గా ప్లాన్ చేసి చిరు తలను కోటగుమ్మానికి వేలాడదీస్తే అభిమానులు ఒప్పుకుంటారా... ఇలాంటి విషాదాంత క్లైమాక్స్ ని వారు జీర్ణించుకోగలరా.. అనేది సురేందర్ రెడ్డి, చిరు ఆలోచించి ఆలోచించి చివరికి ఉన్నది ఉన్నట్టుగా అంటే చరిత్రని ఏమాత్రం వక్రీకరించకుండా అలాంటి విషాదాంత క్లైమాక్స్‌ని ఫాలో అయినట్లు సమాచారం.