Advertisement
Google Ads BL

‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్: ఊర ఊర మాస్!


ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి జగన్నాద్ ప్రస్తుతం అట్టర్ ప్లాప్ దర్శకుడు. ఏ సినిమా తీసినా ఆ సినిమా ప్లాప్ తప్ప హిట్ అన్న పదమే లేదు. మరి మాస్ దర్శకుడిగా అంతో ఇంతో క్రేజ్ ఉన్న పూరి క్లాస్ హీరో రామ్ తో మాస్ టైటిల్ అండ్ స్టోరీ తో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేసాడు. విడుదలకు దగ్గరవుతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా స్మార్ట్ గా మొదలెట్టేసారు. నిన్నమొన్నటివరకు సాంగ్స్ తో హడావిడి చేసిన ఇస్మార్ట్ టీం ఇప్పుడు ట్రైలర్ తో మరింత హడావిడి చేసింది. నిధి అగర్వాల్, నభ నటేష్ హాట్ హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇకపోతే మాస్ మూవీగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ కూడా మాస్ స్టయిల్లోనే ఉంది.

Advertisement
CJ Advs

‘పిల్లి గుడ్డిదైతే ఎల‌క ఎగిరెగిరి చూపించింద‌ట‌’, ‘నీ జాతిలో నా పుల్ల‌…’ అంటూ రామ్ చెప్పే మాస్ డైలాగ్స్ ఇప్పుడు యూత్ కి ఎక్కేలాగే కనబడుతున్నాయి. పూర్తిగా హైద‌రాబాద్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రామ్ డైలాగులు కూడా మాస్ మ‌సాలాగా ఉన్నాయి. ‘అన్నా పోలీసులు నీకు డిప్ప‌లో సిమ్ కార్డు పెట్టినార‌న్నా’ అంటూ గెట‌ప్ శ్రీ‌ను చెప్పగా... ‘దీన్త‌ల్లీ… నా దిమాఖ్ ఏందిరా, డ‌బుల్ సిమ్ కార్డ్ ఫోన్ లెక్క వుంది’ అంటూ రామ్ చెప్ప‌డం బ‌ట్టి చూస్తే… ఒక వ్య‌క్తిలో రెండు బుర్ర‌లు చేసే మ్యాజిక్ ఈ సినిమా అని అర్థం అవుతుంది. ఇక రామ్ మేకోవర్ లో అసలు రామ్ నే ఈ సినిమాలో హీరో అనే రేంజ్ లో ఉంది. పూర్తిగా మాస్ స్టయిల్లో రామ్ మేకోవర్ బావుంది. 

అయితే ట్రైలర్ మొత్తంలో రామ్ రామ్ లా లేడు. కొత్తగా సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన నిధి అగర్వాల్, నభ నటేష్ లు.. రొమాంటిక్ అండ్ హాట్ యాంగిల్స్ లో రెచ్చిపోయారు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పూరీ స్టైల్లో ఉండబోతుందనే విషయం ట్రైల‌ర్‌తో అర్థమవుతుంది. మరోసారి పూరి మార్క్ మాసిజం, రామ్ మార్క్ తెలంగాణ స్టయిల్, హీరోయిన్ల అందాలు.. అన్నీ ఈ సినిమాని ఎంతవరకు ఆదుకుంటాయో అనేది ఈ నెల 18న గాని తెలియదు.

Click Here for Trailer

iSmart Shankar Trailer Review:

iSmart Shankar Trailer Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs