సినిమాలకు జనాలు క్యూ కట్టాలన్నా... కలెక్షన్ల వర్షం కురవాలన్నా.. రివ్యూ రేటింగ్స్ అనేవి ఎంతో కొంత ప్రభావితం చేస్తాయన్నది అందరికీ తెలిసిందే. అయితే అదే రివ్యూ కాస్త నెగిటివ్ వచ్చిందంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఇలా రివ్యూల వల్ల చాలా సినిమాలు ఆడకపోగా.. మరికొన్ని రిలీజ్ అయిన మరుసటి రోజే థియేటర్ల నుంచి ఎత్తిపక్కనెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదీ రివ్యూ రాసేవారి సత్తా. అయితే వీరిలో కొందరు ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా చెబితే.. మరికొందరు పూర్తిగా నెగిటివ్‌గా పోతుంటారు.. ఇక్కడ వారి గురించి అనవసరం.. అ సందర్భం కూడా.
అయితే.. ఇదే రివ్యూ రైటర్స్‌పై ప్రముఖ నటి నివేదా థామస్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవల శ్రీవిష్ణు, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. జూన్ 28న విడుదలై హిలేరియస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నివేదా మాట్లాడుతూ రివ్యూ రైటర్స్ ప్రస్తావన తెచ్చింది.
మా సినిమాను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా చేయడం వల్ల నాకు చాలా మంది బ్రదర్స్, సిస్టర్స్, ఫాదర్స్.. ఇలా చాలా మంది దొరికారని చెప్పుకొచ్చింది. మంచి సినిమాలు వస్తే ఆడియన్స్ సపోర్ట్ చేస్తారని మరోసారి రుజువైంది. రివ్యూల్లో చాలా డీటైల్స్ కూడా రాశారు.. అయితే అసలు విషయాన్ని మాత్రం ఎక్కడా రివీల్ చేయకపోవడం చాలా ఆనందంగా ఉందని.. రివ్యూ రైటర్స్‌కు ఈ సందర్భంగా నివేదా థ్యాంక్స్ చెప్పింది.