Advertisement
Google Ads BL

మంచు లక్ష్మిపై శ్రీరెడ్డి, మహిళా సంఘాలు ఫైర్!


టాలీవుడ్ నటి మంచు లక్ష్మి నిత్యం వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉంది. అప్పుడెప్పుడో ‘నిలదీస్‌ఫై’ అంటూ నిలదీసిన అదే లక్ష్మిని ఇప్పుడు మహిళా సంఘాలు మరీ ముఖ్యంగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి నిలదీస్తోంది. అంత పెద్ద తప్పు ఏం చేసిందబ్బా అనే డౌట్ వస్తోంది కదూ.. అవును మరి రీల్ లైఫ్‌లో కొన్ని కొన్ని చెల్లుబాటు అవుతాయి కానీ.. రియల్‌ లైఫ్‌లో చెల్లవ్ కదా.. ఇలాంటి వివాదంలోనే లక్ష్మి చిక్కుకుంది.

Advertisement
CJ Advs

ఇటీవల టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ స‌మంత ప్రధాన పాత్రలో న‌టించిన ‘ఓ బేబీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం విదితమే. ఈ సినిమాలో లక్ష్మి అతిథి పాత్రలో తళుక్కున మెరిసింది. కార్యక్రమంలో ఓ డైలాగ్ విసిరింది.. ఇదే ఇప్పుడు ఈమెకు తిప్పలు తీసుకొచ్చింది. ట్రైల‌ర్‌లోని ‘నీకు ఎలాంటి మొగుడు కావాలంటే.. అందంగా ఉండాలి.. డ‌బ్బులుండాలి.. మంచ‌మెక్కితే మ‌గాడిలా కాపురం చేయాలి’ అనే డైలాగ్‌ను ఈమె తన నోటితో చెప్పుకొచ్చింది. దీంతో మహిళా సంఘాలు పచ్చిగా మాట్లాడితే లక్షుమక్కా.. ఇదేం రీల్ కాదు కదా.. రియల్ లైఫ్‌లో కదా అంటూ కన్నెర్రజేస్తున్నారు. అంతేకాదు యావత్ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

అంతటితో ఆగని ఆమె.. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌‌ను పొగడ్తల వర్షంలో ముంచెత్త బోయి తప్పులే కాలేసింది. ‘మీరు నటించిన జంబలకిడిపంబ చిత్రం వెయ్యిసార్లుగా పైగా చూసి.. ఆ క్యాసెట్ అరగ్గొట్టేశాం’ అంటూ కాసింత ఎక్కువగానే ఈ ముదురు భామ మాట్లాడింది. వాస్తవానికి ఆయన ఆ సినిమాలో లేరు.. అయితే ఈ వ్యవహారంపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి రియాక్ట్ అవుతూ.. ‘ఇంగ్లీ పుత్రీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. ‘మంచులక్ష్మి జీ.. ‘జంబలకిడిపంబ’ హీరో రాజేంద్రప్రసాద్ గారు కాదమ్మా... పొగడకపోయినా పర్లేదు అవమానించకమ్మా’ అంటూ ఓ పోస్ట్ వదిలింది. సో.. ఈ రెండు విషయాల్లోనూ మంచులక్ష్మి తన ప్రమేయం లేకుండా వివాదంలో చిక్కుకుందన్న మాట.

Mahila Sangams, Sri Reddy fire on Manchu laxmi:

Mahila Sangams, Sri Reddy fire on Manchu laxmi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs