Advertisement
Google Ads BL

ఇందుకేనేమో పవన్ అంటే ఫ్యాన్స్ పడిచచ్చేది!


టాలీవుడ్ హీరో కమ్ పొలిటిషియన్ పవన్ కల్యాణ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో అభిమానులున్నారో కొత్తగా చెప్పనక్కర్లేదు. పవన్‌ కూడా అదే స్థాయిలో వారి కష్ట, సుఖాలు తెలుసుకుంటూ అందర్నీ కలుపుకునిపోతుంటారు. మరీ ముఖ్యంగా ఎవరైనా అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలిసినా.. కార్యకర్తల ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తన దృష్టికి వస్తే చాలు పవన్ చలించిపోతుంటారు. ఆ కష్టాల నుంచి అభిమానులను గట్టెక్కించడానికి శాయశక్తులా పవన్ ప్రయత్నాలు చేస్తుంటారు.

Advertisement
CJ Advs

అయితే.. ఈ సేవలన్నీ పవన్ ఇప్పట్నుంచి కాదు ఎప్పట్నుంచో మొదలెట్టారు. సినిమాలకు దూరమైనప్పటికీ ఆ సేవా భావాన్ని మాత్రం ఆయన ఇంకా కొనసాగిస్తున్నారు. తాజాగా.. విజయనగరం, ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు అభిమానులకు పవన్ తనవంతుగా సాయం చేసి వాళ్లను కష్టాలనుంచి గట్టెక్కించడానికి తనవంతుగా కృషి చేశారు.

ఇక అసలు విషయానికొస్తే... విజయనగరంకు చెందిన విశ్వతేజ అనే కార్యకర్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు పార్టీలోని కొందరు ముఖ్య కార్యకర్తలు, ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా తెలుసుకున్న పవన్ చలించిపోయారు. ఈ విషయంపై ఆరాతీసిన జనసేనాని.. వెంటనే అతనికి  వైద్య ఖర్చుల నిమిత్తం రెండు లక్షల రూపాయల చెక్‌ను పంపారు. ఇదిలా ఉంటే.. అనారోగ్యంతో మంచానికి పరిమితమైన ఖమ్మం జిల్లాకు చెందిన గుబ్బాల సతీష్ పరిస్థితి పవన్ దృష్టికి వెళ్లడంతో.. ఆ యువకుడికి కూడా తన సిబ్బంది ద్వారా లక్ష రూపాయల చెక్‌ను అందజేశారు. పవన్ హెల్పింగ్ నేచుర్‌ను చూసిన నెటిజన్లు ఇందుకేనేమో జనసేనాని అంటే ఫ్యాన్స్ ఇంతలా పడిచచ్చిపోతారని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

News About Janasena chief Pawan kalyan:

News About Janasena chief Pawan kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs