Advertisement
Google Ads BL

తొలిప్రేమ సాంగ్.. ‘మిస్ మ్యాచ్’లో..!


‘మిస్ మ్యాచ్’ అందరికి నచ్చే సినిమా అవుతుంది - చిత్ర యూనిట్.

Advertisement
CJ Advs

‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థలో తొలి చిత్రంగా ‘మిస్ మ్యాచ్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. మిస్ మ్యాచ్ చిత్ర యూనిట్ ఈరోజు మీడియాతో సమావేశం అయి చిత్ర విశేషాలను పంచుకున్నారు వాటి వివరాల్లోకి వెళితే.... 

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ... ‘‘మిస్ మ్యాచ్ చిత్ర కథను భూపతిరాజ గారు ఇచ్చారు. మంచి కథలు వింటున్న సమయంలో ఈ కథ నాకు రావడం అదృష్టం. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం సినిమాకు ప్లస్. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ ఐశ్వర్య రాజేష్ పక్కన నేను నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్ . తొలిప్రేమ సినిమాలోని ‘ఈ మనసే’ సాంగ్ ను సింగిల్ షాట్ లో తీశారు. జాగ్రత్తగా ప్లాన్ చేసి ఈ పాటను తీసాము. కథ, కథనాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. త్వరలో చిత్రం  విడుదల డేట్ ను ప్రకటిస్తాము. ప్రదీప్ రావత్, శరణ్య వంటి మంచి నటీనటులు ఈ సినిమాలో చెయ్యడం జరిగింది.  సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్’’ అన్నారు.

ఈ సందర్బంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ... ‘‘ముందుగా మీడియా వారికి థాంక్స్ సపోర్ట్ చేస్తునందుకు. ఒకమంచి కథ మిస్ చేసుకోకూడదని ఈ సినిమా చేసాను. భూపతిరాజ గారి కథ బాగుంది. దర్శకుడు కథను అందంగా తెరమీద చూపించారు. నా పాత్ర ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది. రఫ్ రోల్ లో మీముందుకు వస్తున్నాను. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఈ రోజు చిన్న సినిమాగా కనిపించే ఈ మూవీ రిలీజ్ తరువాత అందరూ పెద్ద సినిమాగా ఈ సినిమా గురించి మాట్లాడతారు. గణేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్ కళ్యాణ్ గారి  తొలిప్రేమ సినిమాలోని ఒక పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేసాం. తప్పకుండా ఆ పాట మీ అందరికి నచ్చుతుంది’’ అన్నారు.

ఈ సందర్బంగా దర్శకుడు ఎన్ వి. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ... ‘‘ఈ చిత్రంలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా వర్క్ఔట్ అయ్యింది. కొత్త కథతో దర్శకుడిగా తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాతలు  జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నాకు బాగా సహకరించారు. మీ  అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.

నిర్మాత భరత్ రామ్ మాట్లాడుతూ... ‘‘వినోద్ కుమార్ గారు ఈ కథ చెప్పాక బాగా నచ్చింది. ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ చాలా బాగా నటించారు. హీరోయిన్ ఒక స్పోర్ట్స్ నేపధ్యంగా ఉన్న పాత్రలో నటించింది. ఛాలెంజింగ్ రోల్ లో నటించింది. గిఫ్టన్ ఇలియాస్ సంగీతం నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి’’ అన్నారు.

నటి రూప లక్ష్మీ మాట్లాడుతూ.. ‘‘సక్సెస్ ఫుల్ టీమ్ కలిసి ఈ సినిమా చేశారు. ఒక మంచి విందు భోజనం లాంటి సినిమా మిస్ మ్యాచ్. ఎమోషన్స్  ఈ సినిమాలో బాగా ఉంటాయి. ఈ చిత్ర దర్శకుడు తీసిన డాక్టర్ సలీం నాకు బాగా ఇష్టం. ఈ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధిస్తుందని  భావిస్తున్నా’’ అన్నారు.

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, కళా దర్శకుడు: మణి వాసగం దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ . నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భారత్ రామ్

Miss Match Movie Details:

Tholiprema Song Remix in Miss Match Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs