Advertisement
Google Ads BL

నాగ్ నెక్ట్స్ రొమాన్స్ చేసేది ఎవరితోనో తెల్సా?


మన్మథుడు 2 షూటింగ్ తో నాగార్జున ప్రస్తుతానికి ఫుల్ బిజీ. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు సీక్వెల్ యమా ఫాస్ట్ గా చిత్రీకరణ జరుపుకుంటుంది. నాగార్జున మన్మథుడు 2 షూటింగ్ పూర్తి కాగానే కళ్యాణ్ కృష్ణతో బంగార్రాజు సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు. నాగ చైతన్యతో నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాని కళ్యాణ్ కృష్ణ ఐదు నెలలలో పూర్తి చేసి సంక్రాంతి టార్గెట్ గా విడుదల చెయ్యబోతున్నాడు. అయితే ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణకి రెమ్యునరేషన్ ఇవ్వకుండా... లాభాల్లో వాటా ఇస్తానని నాగార్జున దర్శకుడు కళ్యాణ్ కి చెప్పాడట. ఎలాగూ ప్లాప్స్ లో ఉన్న కళ్యాణ్ దానికి ఒప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

ఇక ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు స్క్రిప్ట్ ని చెక్కుతున్నాడు. దానితో పాటుగా బంగార్రాజు కోసం నటీనటుల ఎంపిక కూడా మొదలెట్టినట్లుగా సమాచారం. ఇప్పటికే నాగ చైతన్య పక్కన కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారనే న్యూస్ ఉంది. ఇక తాజాగా నాగార్జున సరసన మరో యంగ్ బ్యూటీ పేరు వినబడుతుంది. అది కూడా స్టార్ హీరోలతో క్షణం తీరిక లేకుండా షూటింగ్ ల మీద షూటింగ్ లు చేస్తూ భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న పూజా హెగ్డే, నాగ్ సరసన బంగార్రాజు లో రొమాన్స్ చేయబోతున్నట్లుగా ఫిలిం నగర్ టాక్. 

మరి మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ లాంటి యంగ్ హీరోలే కాదు.. అవకాశమొస్తే సీనియర్ హీరోలని వదలను అన్నట్టుగా ఉంది పూజా వ్యవహారం. ఇక పూజా గనక నాగ్ సరసన నటించడమే నిజమైతే.. మన్మథుడు 2లో రకుల్ తో రొమాన్స్ చేస్తున్న నాగ్.. ఇప్పుడు బంగార్రాజు లో పూజాతో కూడా రొమాన్స్ చేస్తాడన్నమాట.

Young Heroine in Nagarjuna Bangarraju Movie:

Pooja Hegde in Nagarjuna and Kalyan Krishna Bangarraju Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs