Advertisement
Google Ads BL

బాలీవుడ్ బ్యూటీకి విజయదేవరకొండ గిఫ్ట్!


అవును మీరు వింటున్నది నిజమే.. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీకి టాలీవుడ్ హీరో విజయదేవరకొండ గిఫ్ట్ ఇచ్చారు. అంటే వీరిద్దరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అనుకుంటున్నారేమో అదేం కాదండోయ్.. జస్ట్ ఫర్ ఫ్రెండ్ షిప్‌ మాత్రమేనట. అంతే.. అంతకుమించి ఎవరూ ఏమీ ఊహించుకోనక్కర్లేదట.. తప్పుగా అనుకోవద్దు!

Advertisement
CJ Advs

తెలుగు సూపర్ డూపర్ హిట్టయిన ‘అర్జున్ రెడ్డి’ హిందీలో రీమేక్‌గా ‘కబీర్ సింగ్’ పేరుతో రిలీజ్ చేసిన విషయం విదితమే. గత నెల జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కబీర్ సింగ్’ గ్యాప్ లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. రూ. 200 కోట్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ కలెక్షన్లు చూసి ఆనందంలో మునిగిపోయిన ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయదేవరకొండ.. ‘కబీర్ సింగ్’లో నటించి మెప్పించి కోట్లాది మంది అభిమానుల మనసు దోచుకున్న కైరాకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు.

అంతే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కైరాకు ఎంతో ఇష్టమైన డ్రెస్‌ను గిఫ్ట్‌గా పంపుతున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ సడన్ సర్‌ఫ్రైజ్‌తో అందరూ ఆశ్చర్యపోతారని.. సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనుకుంటారని భావించిన విజయ్.. ఎవరూ తప్పుగా అనుకోవద్దని కూడా సందేశం పంపాడు. ఈ గిఫ్ట్‌కు ఫిదా అయిపోయి బహుమతి పంపినందుకు ధన్యవాద్ అంటూ బాలీవుడ్ బ్యూటీ చెప్పుకొచ్చింది. అయితే బాలీవుడ్‌తో ఈ బహుమతులు ఆగుతాయా.. ? తనతో కలిసి నటించి స్టార్‌ను చేసిన షాలినీ కూడా ఏమైనా గిఫ్ట్ పంపుతారో లేకుంటే లైట్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

Arjun Reddy star Vijay Devarakonda Sends special gift for Kiara Advani :

Arjun Reddy star Vijay Devarakonda Sends special gift for Kiara Advani 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs