టాలీవుడ్‌లో ఒకప్పుడు యాంకర్లు ఎలా ఉండేవారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో ఎలా మెయిన్‌టైన్ చేసేవారో అందరూ చూసేవుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.. అంతే రీతిలో డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారింది. కాలానుగుణంగా మారడంలో ఎలాంటి తప్పులేదు.. ఇది ఎవరూ తప్పుబట్టరు కూడా. మరీ పద్దతులు పక్కనపెడితే అసలు సమస్య వచ్చిపడేది. ఈ విషయంలో తెలుగు యాంకర్లు శృతి మించియారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
యాంకర్ శ్రీముఖి ఎక్కడ్నుంచి కెరీర్ ప్రారంభించిందో.. ఇప్పుడు ఏ రేంజ్‌కు ఎదిగిపోయిందో అందరికీ తెలుసు. ఎదిగో కొద్ది ఎంతో ఒదిగి.. అణిగిమణిగి ఉండాలని పెద్దలు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా పద్ధతులు అనేవి మరవకూడదంటారు. అయితే ‘నా దారి రహదారి.. అంతా నా ఇష్టం’ అంటూ శ్రీముఖి రెచ్చిపోతోంది. షోలు మొదలుకుని ఫొటోగ్రఫీ వరకు ఈమె చేస్తున్న చేష్టలు ఒక్కోసారి విరక్తి పుట్టిస్తున్నాయ్ అంటూ నెటిజన్లు, క్రిటిక్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఇదిగో.. పక్కనే ఉన్న ఫొటోల వైపు ఓ లుక్కేయండి... మీకే అసలు విషయం అర్థమవుతుంది. ఎక్కడికో ఎదిగిపోవాలని ఇలా మెల్లగా డోస్ పెంచేస్తోందో లేకుంటే ఈమె మనసులో మరోటి ఉందేమో తెలియదు కానీ.. మరీ ఇలా క్లీవేజ్ షో చేయడం ఎంత వరకు సబబో. క్లీవేజ్ ఒక్కటే కాదండోయ్ బాబూ.. నముడు సోయగాలు చూపిస్తూ పెద్ద హడావుడే చేస్తోంది. ఈ హాట్ ఫొటోలన్నీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అయితే వీటికి కొందరు సూపర్బ్ అని మెచ్చుకుంటుండగా.. మరికొందరు మాత్రం బూతుల వర్షం కురిపిస్తున్నారు.