Advertisement
Google Ads BL

బాలయ్యకు బాగా తెలిసొచ్చింది.. ఇక ఎన్టీఆర్‌తో!


టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలు తీయడం మొదలుపెడితే.. నటన తప్ప మరోటి పట్టించుకోరంతే. అంతేకాదు.. సినిమాలు హిట్టవ్వడం మొదలైతే ఇక ఆయనకు ఎదురుండదు.. అదే టైమ్‌లో మూవీస్ రిలీజ్ చేయాలని కూడా ఎవరూ సాహసించరు కూడా. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యిందండోయ్. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత బాలయ్య పొలంలో మొలకలు రావట్లేదు.! 

Advertisement
CJ Advs

‘జైసింహ’, ‘ఎన్టీఆర్ బయోపిక్’ రెండు పార్ట్‌లు కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి. అంతేకాదు.. ఎన్టీఆర్ బయోపిక్‌ సినిమాకు అధికారికంగా వేరేవాళ్లు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించినప్పటికీ డబ్బులంతా బాలయ్యే పెట్టుకున్నారట. ఈ రెండు కూడా అట్టర్ ప్లాప్ అవ్వడంతో డబ్బులు పాయె.. నాన్న పేరు చెడగొట్టారని క్రిటిక్స్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల నుంచి ఈ బయోపిక్ విషయంలో అసంతృప్తి జ్వాలలు రగిలాయట.

వరుస ప్లాప్‌లతో బాలయ్య బాగా తెలిసిరావడంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్‌నగర్‌లో ఓ పుకారు షికారు చేస్తోంది. బాలయ్య-ఎన్టీఆర్ లేదా.. బాలయ్య- కల్యాణ్‌రామ్‌తో మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేయాలని అనుకున్నారట. మంచి కథ దొరికితే.. డైరక్టర్‌ కాసింత నమ్మకం కుదిరితో అబ్బాయ్‌ను ఒప్పించడానికి బాబాయ్ సిద్ధమట. అంతేకాదు.. ఇంత వరకూ మల్టిస్టారర్‌ తరహాలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయ్.. దీంతో బాలయ్య కూడా ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఇది ఎంత వర్కవుట్ అవుతుందో..? బాలయ్య నిజంగానే ఆలోచిస్తున్నారా..? లేదా అనేదానిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.

Balakrishna key decision after serial utter flop movies:

Balakrishna key decision after serial utter flop movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs