Advertisement
Google Ads BL

‘కల్కి’ బి, సి సెంటర్ మాస్ సినిమా! ప్రశాంత్ వర్మ (ఇంటర్వ్యూ)


‘అ!’ చిత్రంతో అటు ప్రేక్షకుల్ని, ఇటు విమర్శకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తెలుగు ప్రేక్షకులు కొత్త తరహా చిత్రాన్ని అందించారు. ‘అ!’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి’. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా శివాని, శివాత్మిక, ‘వైట్ లాంబ్ పిక్చర్స్’ వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. జూన్ 28న విడుదలైన ఈ సినిమా కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా, మాస్ హిట్‌గా నిలిచింది. ఈ  సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు...

Advertisement
CJ Advs

సినిమాకు ఎలాంటి స్పందన వస్తోంది?

దర్శకుడిగా నా తొలి సినిమా ‘అ!’ ఏ సెంటర్ సినిమా అయితే... ‘కల్కి’ బి, సి సెంటర్ సినిమా. సరికొత్త కమర్షియల్ పంథాలో తీసిన సినిమా. ఏ ప్రేక్షకులైతే మా టార్గెట్ అనుకుని సినిమా తీశామో వాళ్ళందరికీ సినిమా నచ్చింది. అయామ్ సో హ్యాపీ.

రాజశేఖర్ గారి తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్? ఆయన షూటింగ్ కి సకాలంలో రాకపోవడం వల్ల దర్శకులు ఇబ్బంది పడతారని విమర్శ ఒకటి ఉంది!

అటువంటిది ఏమీలేదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే... షూటింగ్ చకచకా పూర్తి చేయవచ్చు. హీరో రాకముందు కొన్ని సన్నివేశాలు కూడా తీయవచ్చు. ఆయన టైం కి రారు అనడం కంటే... సన్నివేశాలను మరింత బాగా తీయడానికి నాకు టైం ఇచ్చారు. రాజశేఖర్ గారు డైరెక్టర్స్ ఫ్రెండ్లీ హీరో.

‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ డైలాగ్ పెట్టాలని ఐడియా ఎవరిది?

నాదే. ఒక్కసారి కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా తీయాలని డిసైడ్ అయిన తర్వాత... ఈ ఐడియా వచ్చింది. మన మీద మనమే సెటైర్ వేసుకుంటే బాగుంటుంది అని... రాజశేఖర్ గారి గురించి ఎక్కువ ట్రోలింగ్ చేసే టాపిక్ ఏంటని చూశాం. ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ డైలాగ్ ట్రోలింగ్ టాపిక్స్ లో ఒకటి‌. దీన్ని సినిమా లో పెడదామని రాజశేఖర్ గారికి చెప్పగానే ఒప్పుకున్నారు. నేను కొత్త దర్శకుడు అయినా ఏం అడిగితే అది చేశారు.

తన కథను కాపీ చేశారని ఒక రచయిత మీడియా ముందుకు వచ్చినట్టున్నారు?

అవును.. అయితే.. అతను ఆరోపించిన తర్వాత మా కథను రచయితల సంఘానికి చూపించాం. రెండిటి మధ్య ఎలాంటి సారూప్యతలు లేవని తేల్చారు. దాంతో వారు సినిమాలు కూడా చూడలేదు.

సినిమా స్క్రీన్ ప్లేకి సుమారు పదిమంది వరకు వర్క్ చేసినట్టున్నారు. తెరపై చాలా పేర్లు పడ్డాయి.

వాళ్లందరూ మా స్క్రిప్ట్ విల్ టీమ్ మెంబెర్స్. కథ రాసిన తర్వాత స్క్రీన్ ప్లే ఎలా ఉంటే బాగుంటుందని చాలా వెర్షన్స్ రాస్తాం. అదంతా పూర్తయిన తర్వాత మా సిస్టర్ ఏది బాగుందో చెబుతుంది. దాన్ని ఫైనల్ చేస్తాం. స్క్రిప్ట్ విల్ టీమ్ లో నాకంటే వయసులో పెద్ద వాళ్ళు, సినిమాలపై ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కథలపై వర్క్ చేస్తున్నాం.

తొలుత ఈ కథను మీరు డైరెక్ట్ చేయాలనుకోలేదట. స్క్రిప్ట్ వరకు ఇచ్చి, వేరే డైరెక్టర్ తో చేయాలని అనుకున్నారట.

అవును. ఆరు నెలల్లో స్క్రిప్ట్ పై వర్క్ చేసిన తర్వాత ఈ కథలో డైరెక్ట్ చేయాలని ఎగ్జైటింగ్గా అనిపించింది. ఆరు నెలలలో లో రాజశేఖర్, జీవిత, వాళ్ల ఫ్యామిలీ తో ట్రావెలింగ్ బాగుంది. వాళ్లు సెన్సిబుల్ పీపుల్. (నవ్వుతూ) వీళ్లను భరించొచ్చు అనిపించిన తర్వాత నేనే డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యా.

జీవిత గారు సినిమా విషయంలో ఎంత వరకు ఇన్వాల్వ్ అయ్యారు?

నా అనుభవం రెండు సినిమాలు మాత్రమే. రాజశేఖర్ గారు, జీవిత గారు ముప్పై ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో సినిమాలు చేశారు. వాళ్ళు ఏదైనా చెబితే వింటాను. నేను చెప్పిందే తీయాలనుకునే రకం కాదు. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ లో కూడా ఎవరైనా నా సలహా ఇస్తే, నేను కన్విన్స్ అయితే తీసుకుంటాను. వాళ్లకు క్రెడిట్ ఇస్తా.

సినిమాలో క్లైమాక్స్ కి మంచి పేరు వచ్చింది. మీరు క్లైమాక్స్ ముందు రాసుకుని తర్వాత కథ రాస్తారట?

అవునండి. క్లైమాక్స్ యే‌ కథ అని నేను నమ్ముతా. ఒక్కసారి క్లైమాక్స్ ఎలా చేస్తే బాగుంటుందనేది రాసుకున్న తర్వాత... స్క్రీన్ ప్లే రాస్తాను. క్లైమాక్స్ వరకు రెండు గంటలు ప్రేక్షకులు ఆసక్తిగా కూర్చునేలా కథను రూపొందిస్తా‌. 

‘అ!’, ‘కల్కి’... రెండు చిత్రాల్లో అసలు కథేంటో క్లైమాక్స్ వరకు తెలియదు. ట్విస్టులతో సినిమాలు తీశారు. దర్శకుడిగా మీపై ఇటువంటి చిత్రాలు తీస్తారనే ముద్ర పడుతుందేమో?

నా తదుపరి సినిమాగా మంచి ప్రేమ కథను తీస్తానేమో. ఒకే తరహా చిత్రాలు తీయడం నాకు నచ్చదు. డిఫరెంట్ జోనర్‌లో డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు తీయాలని ఉంది. 

శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది. అతను మీ ఫ్రెండ్. అందువల్లే మీకు బాగా చేశాడా?

ఒక్కటి మాత్రం నిజం... తను నా ఫ్రెండ్ కాబట్టి ఈ సినిమాకు తీసుకున్నా. బీటెక్‌లో నేను తీసిన కొన్ని వీడియోలను తన సంగీతంతో బాగా చూపించాడు. తనకు మంచి బ్రేక్ రావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. మా సినిమాలో అందరి కంటే తనకు ఎక్కువ పేరు రావడం సంతోషంగా ఉంది.

నెక్స్ట్ సినిమా ఏంటి?

ఏమో... రెండు మూడు కథలు ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి. త్వరలో చెబుతా. హాట్ స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ తీసే ఆలోచనలోనూ ఉన్నాం.

మీ తొలి సినిమా నిర్మాత నానితో టచ్ లో ఉన్నారా?

ఉన్నానండి. ఇటీవలే ఆయనను కలిశా. ఒక కథ గురించి చర్చించుకున్నాం. సినిమా చేయాలంటే జాతకాలు అన్ని కలవాలి.

Kalki Movie Director prasanth Varma interview:

Kalki Movie Director prasanth Varma interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs