Advertisement
Google Ads BL

ఒక మనిషిగా ఎంత వరకు కరెక్ట్..: అనసూయ


సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండే నటీనటుల్లో హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరని చెప్పుకోవచ్చు. నిత్యం ఏదో ఒక విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ అభిమానులకు బాగా దగ్గరవుతుంటారు. అయితే తాజాగా.. ట్విట్టర్ వేదికగా ఒకింత ఆవేదనకు లోనైన అనసూయ.. మన కళ్ల ఎదుట తప్పు జరుగుతుంటే అడ్డుకోవాల్సింది పోయి, దానికి ఎవరినో బాధ్యుల్ని చేస్తూ నిందించటం సరికాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Advertisement
CJ Advs

అంతటితో ఆగని ఆమె.. మన వనరులను, కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. ప్రతి విషయానికి మనం వేరొకరిని ఎందుకు నిందించాలి? నీటిని సంరక్షించుకోవాలంటే ప్రభుత్వాన్ని, అమ్మాయిలకు రక్షణ లేదంటే పోలీస్‌నో లేదంటే ప్రభుత్వాన్ని నిందించటం.. మన వనరులను, కుటుంబాలను మనమే కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక కర్తవ్యం కాదా? మన ముందు, మన చుట్టుపక్కల ఏదన్నా చెడు లేదా తప్పు జరుగుతుంటే ఆపకుండా.. ఎక్కడో స్టేషన్‌లో కూర్చొన్న పోలీస్‌ని, ఆఫీస్‌లో ఉన్న అధికారిని, ప్రభుత్వాన్ని అనడం ఎంత వరకూ కరెక్ట్ చెప్పండంటూ అనసూయ కన్నెర్రజేసింది.  

‘నేను చేసే, చేయబోయే, చేయాలనుకునే, చేయకుండా ఉండాలనుకునే పని ఒక మనిషిగా ఎంత వరకూ కరెక్ట్’ అని ఎవరికి వారే ఎడ్యుకేట్ చేసుకోవాలి.. ఇది కాదా మన ప్రథమ కర్తవ్యం?’ అని హాట్ బ్యూటీ అనసూయ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు సానకూలంగా స్పందించగా.. మరికొందరు మాత్రం ఓహ్.. బాగానే చెప్పుకొచ్చార్లేండి అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. 

News About Anchor Anasuya Bharadwaj Tweet:

News About Anchor Anasuya Bharadwaj Tweet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs