భారీ గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమాని మొదలు పెట్టి.. వాయువేగంతో ఆ సినిమాని కంప్లీట్ చేస్తున్నాడు. రెస్ట్ లేకుండా సెకండ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. త్రివిక్రమ్ కూడా ఇదివరకటిలా కాకుండా అల్లు అర్జున్ సినిమాని చాలా స్పీడు గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ తో కమిట్ అయ్యాడు. కమిట్ అవడమే కాదు ఆ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దాని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ కనబడుట లేదనే సినిమాకి కూడా కమిట్ అయ్యాడు.
సుకుమార్ సినిమా కన్నా ముందే వేణు శ్రీరామ్ ఐకాన్ పట్టాలెక్కబోతుంది. అయితే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఐకాన్ సినిమాలో అల్లు అర్జున్ రెండు అంతకు మించిన గెటప్ ల్లో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ గెటప్స్ లో ఒకటి మిడిల్ ఏజ్డ్ గెటప్‌గా ఉండబోతుందట. మరి అల్లు అర్జున్ అలా మిడిల్ ఏజ్డ్ గెటప్లో ఫస్ట్ టైమ్ కనిపించబోతున్నట్లే. ఎందుకంటే అల్లు అర్జున్ ఇంతవరకు అలంటి గెటప్ ట్రై చేసింది లేదు.
ఇక మరొక గెటప్ యంగ్ ఏజ్ అని.. అయితే ఇంకో గెటప్ కూడా ఈ సినిమాలో ఉంటుంది కానీ.. అది ఎలాంటి గెటప్ అనేది ఇంకా క్లూ దొరకలేదు. అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మొదటిసారి విగ్ కూడా పెట్టుకోబోతున్నాడట. ఇంతవరకు అల్లు అర్జున్ కి విగ్ పెట్టుకునే అవసరం రాలేదు.. కానీ ఈ ఐకాన్ కోసం అల్లు అర్జున్ మొట్టమొదటిసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు.