Advertisement
Google Ads BL

నటనతో మరోసారి అదరగొట్టి హిట్టుకొట్టింది


ఇంద్రగంటి మోహనకృష్ణ.. నాని జెంటిల్‌మెన్ కోసం కొత్త హీరోయిన్ నివేత థామస్ ని తీసుకొచ్చాడు. ఆ సినిమాలో నివేత నటనకు టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తెలుగు, తమిళంలో మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటూ నటిస్తున్న నివేత థామస్ స్టార్ హీరో ఎన్టీఆర్ కోసం జై లవ కుశ సినిమాలో చిన్నపాటి కేరెక్టర్ చేసింది. ఆ సినిమా హిట్ అయినా నివేతకి పెద్దగా క్రేజ్ తీసుకురాలేకపోయింది. తర్వాత నివేత కి కళ్యాణ్ రామ్ 118 లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా హిట్. తాజాగా నివేత నటించిన బ్రోచేవారెవరురా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా హిట్ టాక్ తో అదరగొట్టేస్తుంది. శ్రీ విష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రోచేవారెవరురా సినిమాకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కావాల్సినంత కామెడీ పండడంతో సినిమాకి హిట్ టాక్ పడింది. ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా బ్రోచేవారెవరురాకి మంచి మార్కులేశారు.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేత నటనను కూడా మెచ్చుకుంటున్నారు. మిత్ర కేరెక్టర్ లో ఫస్ట్ హాఫ్ లో నివేత నటన సూపర్బ్. కాకపోతే సెకండ్ హాఫ్ లో నివేత కిడ్నాప్ అవడంతో నివేత నటనకు స్కోప్ లేకుండా పోయింది. బ్రోచేవారెవరురా సినిమా మొదలెట్టినప్పటినుండి చెప్పినట్లుగా కథ మొత్తం నివేతనే బేస్ చేసుకుని సాగుతుంది. డాన్స్ మీద ఇష్టాన్ని చంపుకుని నాన్న మాట కాదనలేక బలవంతంగా చదువుతూ నలిగిపోయే పాత్రలో మంచి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. కామెడీ లేకుండా సీరియస్ గా సాగిపోయే ఎమోషన్స్ ని అవసరమైన చోట బాగా పలికించింది. సినిమా ఫస్ట్ హాఫ్ లో నివేత థామస్ చేసిన అల్లరికి ప్రేక్షకులు మెచ్చేసుకుంటున్నారు. మొత్తానికి గ్లామర్ చూపకపోయినా.. నటనతో మళ్ళీ నివేత అదరగొట్టేసింది.

Superb Response to Nivetha Thomas Acting in Brochevarevaruraa:

Brochevarevaruraa gets good Response at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs