Advertisement
Google Ads BL

సూర్య ఈసారి ‘బందోబస్త్’తో వస్తున్నాడు


సూర్య హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా టైటిల్ ‘బందోబస్త్’

Advertisement
CJ Advs

ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేసే హీరోల్లో సూర్య ఒకరు. ప్రతిసారీ కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రయత్నిస్తారు. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ‘సింగం’ వంటి పక్కా కమర్షియల్ సినిమాలు.. ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’, ‘24’ వంటి డిఫరెంట్ సినిమాలు... ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి లవ్ స్టోరీలు చేయడం ఆయనకు మాత్రమే సాటి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న తమిళ సినిమా ‘కప్పాన్’. తెలుగులో ఈ సినిమా ‘బందోబస్త్’గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సినిమా తెలుగు టైటిల్, లుక్ ను దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేశారు. ‘రంగం’తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరుచుకున్న కె.వి. ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్’ తరవాత సూర్య, కె.వి. ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ‘నవాబ్’, ‘2.0’ వంటి హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నారు.

మోహన్ లాల్, బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి, రైటర్: పి.కె.పి & శ్రీ రామకృష్ణ, లిరిక్స్: వనమాలి, చంద్రబోస్, ఆర్ట్ డైరెక్టర్: డి.ఆర్.కె. కిరణ్, ఎడిటర్: ఆంటోనీ, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్స్, డాన్స్: బాబా భాస్కర్, శోభి, గణేష్ ఆచార్య, సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్. ప్రభు, సంగీతం: హారీస్ జయరాజ్, నిర్మాత: సుభాస్కరణ్, దర్శకత్వం: కె.వి. ఆనంద్.

Suriya Next Film Details:

Lyca Productions Bandobast with Suriya as the hero
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs