జబర్దస్త్ ద్వారా హాట్ యాంకర్ గా అందరి మనస్సుల్లో తిష్ట వెయ్యడమే కాదు... కేవలం జబర్దస్త్ షో ద్వారానే తెగ పాపులర్ అయిన ఆంటీ అనసూయ... వెండితెర మీద అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవడంతో.. జబర్దస్త్ ని వదిలేస్తుందనే న్యూస్ గత వారం రోజుల నుండి ప్రచారంలో ఉంది. జబర్దస్త్ లో పెళ్లికాని యాంకర్స్ కూడా వెయ్యని హాట్ హాట్ చిట్టి పొట్టి డ్రెస్సులతో... యూత్ ని తనవైపు తిప్పుకున్న అనసూయ కి జబర్దస్త్ ప్రోగ్రామే ప్రాణం పోసింది. ఆ షోతోనే అనసూయ తెగ పాపులర్ అవడమే కాదు.. చేతినిండా సంపాదన పెరిగింది. మరి అలాంటి జబర్దస్త్ షో ని అనసూయ వదలడమా? నెవ్వర్ అంటూ కామెంట్స్ పడుతున్నాయి కానీ.... అనసూయ క్లారిటీ ఇవ్వడం లేదు.
తాజాగా తనకి మంచి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని ఎలా వదులుకుంటానని.. సినిమాల్లో ఎన్ని అవకాశాలొచ్చినా.. తాను జబర్దస్త్ ని వదిలే ప్రసక్తే లేదంటూ సన్నిహితుల దగ్గర చెబుతుందట. తనకి కొరటాల - చిరు సినిమాతో పాటు, ఎన్ని సినిమా అవకాశాలు వచ్చినా.. తాను మాత్రం జబర్దస్త్ ని విడిచి పోనని చెబుతుందట. తాను జబర్దస్త్ ప్రోగ్రాంను వీడే సమస్యే లేదని ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ ఫేక్ వార్తలని అనసూయ కొట్టి పడేసినట్టు తెలుస్తుంది.