సీక్రెట్‌గా పీవీ సింధు హోటల్‌ బిల్లు కట్టిన మంచు హీరో


అవును మీరు వింటున్నది నిజమే.. భారత్ బాడ్మింటన్ సంచలనం పీవీ సింధు హోటల్ బిల్‌ను టాలీవుడ్ హీరో మంచు విష్ణు చెల్లించాడు. ఇది అనుకోకుండా జరిగిపోయింది. అలా సీక్రెట్‌గా బిల్లు కట్టి సింధును సర్‌ఫ్రైజ్ చేశాడు. ఈ విషయాన్ని అటు సింధు.. ఇటు విష్ణు ఇద్దరూ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశారు.

అసలు విషయానికొస్తే.. ఇటీవల ఓ స్టార్ హోటల్‌లో పీవీ సింధు మరో మహిళ యూ ఎస్ కౌన్సిల్ జనరల్ క్యాథరిన్ హడ్డాతో కలిసి లంచ్ చేసింది. అదే టైమ్‌లో అక్కడున్న విష్ణు వారిద్దరికీ తెలియకుండా బిల్లు చెల్లించాడు. ఎవరు చెల్లించారబ్బా అని వారిద్దరూ కాసింత ఆశ్చర్యయానికి లోనయ్యారు. తీరా చూస్తే విష్ణు.. ఇలా సర్‌‌ఫ్రైజ్ చేశారట.

ఈ విషయాన్ని స్వయానా సింధు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘‘మంచు విష్ణుని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. మా బిల్ చెల్లించినందుకు మీకు కృతఙ్ఞతలు’’ అని ట్విట్టర్‌లో చెప్పుకొచ్చింది. మరోవైపు విష్ణు రిప్లై ఇస్తూ.. ‘‘మీలాంటి లవ్లీ లేడీస్ లంచ్ బిల్ చెల్లించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అయినా ఆడవారి చేత బిల్ కట్టించడం పురుష లక్షణం కాదు. సింధు నువ్వు చాలా పొడగరి’’ అని మంచువారబ్బాయి ట్విట్టర్‌లో చెప్పుకొచ్చాడు.

Manchu Hero Surprises PV Sindhu at Hotel:

Manchu Vishnu Paid pv Sindhu Hotel Bill
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES